కరోనా తీవ్రత తగ్గింది....భయపడాల్సిన అవసరం లేదు
ABN , First Publish Date - 2020-10-03T21:54:11+05:30 IST
కరోనా తీవ్రత తగ్గింది...భయపడాల్సిన పని లేదు... మీకు నేను మా ప్రజా ప్రతినిధులంతా అండగా ఉంటాం అంటూ.
పాలకుర్తి: కరోనా తీవ్రత తగ్గింది...భయపడాల్సిన పని లేదు... మీకు నేను మా ప్రజా ప్రతినిధులంతా అండగా ఉంటాం అంటూ...ఒకవైపు ధైర్యం చెబుతూ... మరోవైపు మీకు ఆరోగ్య సమస్యలుంటే దవాఖానలో చేర్చుతాను అంటూ తనదైన శైలిలో కరోనా బాధితులు,వారి కుటుంబసభ్యులు,ప్రజాప్రతినిధులు,అధికారులు,వైద్యులు పోలీసులు తదితర అధికారులతో రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు టెలీ కాన్ఫరెన్స్ లో మాట్లాడారు
ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ మాస్కులు ధరిస్తూ...భౌతిక దూరం...స్వీయ నియంత్రణ పాటిస్తే కరోనా నుండి మనల్ని మనం రక్షించుకోవచ్చు అన్నారు అలాగే కరోనా తీవ్రత తగ్గింది...భయపడకండి...మీరంతా బాగుపడతారంటూ మనోధైర్యం కల్పించారు ఇసొలేషన్ లో వున్న కరోనా బాధితులందరూ వేడి వేడి ఆహారం తీసుకోవాలన్నారు.ఈ టెలీ కాన్ఫరెన్స్ లో కరోనా బాధితులు,వారి కుటుంబసభ్యులు,ప్రజా ప్రతినిధులు,వైద్యులు,పోలీసులు,అధికారులు తదితరులు పాల్గొన్నారు