మాస్కులు, స్వీయ నియంత్రణ పాటిస్తే కరోనా ఖతం- ఎర్రబెల్లి

ABN , First Publish Date - 2020-09-20T22:26:30+05:30 IST

మాస్కులు ధరించి భౌతిక దూరం పాటించడం, స్వీయనియంత్రణ పాటిస్తే కరోనా ఏమీ చేయదని పంచాయితీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లిదయాకర్‌ రావు అన్నారు.

మాస్కులు, స్వీయ నియంత్రణ పాటిస్తే కరోనా ఖతం- ఎర్రబెల్లి

హైదరాబాద్‌: మాస్కులు ధరించి భౌతిక దూరం పాటించడం, స్వీయనియంత్రణ పాటిస్తే కరోనా ఏమీ చేయదని పంచాయితీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లిదయాకర్‌ రావు అన్నారు. తననియోజక వర్గం పాలకుర్తిలోని కరోనా బాధితులకు భరోసా కల్పించారు. వారితో మంత్రి ఎర్రబెల్లి మాట్లాడారు. పాలకుర్తి, కొడకండ్ల, దేవరుప్పల, పెద్దవంగర, తొర్రూరు, రాయపర్తిమండలాల్లోని కరోనా బాధితులు, వారి కుటుంబ సభ్యులు , ప్రజా ప్రతినిధులు, అధికారులతో మంత్రి ఎర్రబెల్లి ఆదివారం టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఇందులో నియోజక వర్గ వ్యాప్తంగా ఎంపీలు, జెడ్పీటీసీలు, ఆర్డీవోలు, ఎమ్మార్వోలు, సీఐలు, ఎస్‌ఐలు డిఎంహెచ్‌ఓ, డాక్టర్లు తదితరులు మాట్లాడారు. వారి యోగక్షేమాలను మంత్రి అడిగి తెలుసుకున్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనాబాధితులకు మనో ధైర్యం ఇవ్వడం కోసమే నేరుగా టెలికాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్నట్టు చ ఎప్పారు. ఇప్పటికే కరనో తీవ్రత కొంత తగ్గిందన్నారు.


సీఎం కేసీఆర్‌, మంత్రులు కేటీఆర్‌ , ఈటల ఆధ్వర్యంలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల వల్ల మన రాష్ట్రంలో వైరస్‌ అదుపులోనే ఉందన్నారు. ప్రజలు స్వీయ నియంత్రణ, సామాజిక దూరం పాటించడంతో పాటు తప్పకుండా మాస్కులు ధరించాలన్నారు. కరోనా వచ్చిన వారు ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు. ప్రైవేట్‌దవాఖానాలకన్నా సర్కార్‌ దవాఖానాల్లో మంచి సౌకర్యాలు ఉన్నాయని చెప్పారు. 


కరోనా బాఽఽధితుల కోసం కడకండ్ల, దేవరుప్పల, పాలకుర్తి మండలాలకు అందుబాటులో ఉండే విధంగా ఒక అంబులెన్స్‌వాహనాన్నిపాలకుర్తిలో సిద్దంగా ఉంచామన్నారు. కరోనా బాధితులు తొందరగా కోలుకోవాలని కోరుకుంటున్నానని అన్నారు. రోగ నిరోధకశక్తి పెరిగే ఆహారం వేడివేడిగా తీసుకోవాలని సూచించారు.

Updated Date - 2020-09-20T22:26:30+05:30 IST