దేవాదుల కాలువను పరిశీలించనున్న మంత్రి ఎర్రబెల్లి

ABN , First Publish Date - 2020-05-18T00:37:33+05:30 IST

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన దేవాదుల కాలువ పనులను పంచాయితీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు సోమవారం పరిశీలించనున్నారు.

దేవాదుల కాలువను పరిశీలించనున్న మంత్రి ఎర్రబెల్లి

హైదరాబాద్‌: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన దేవాదుల కాలువ పనులను పంచాయితీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు సోమవారం పరిశీలించనున్నారు. వరంగల్‌ రూరల్‌జిల్లా పరకాల నియోజక వర్గం పరిధిలోని వరంగల్‌ కోటమండలం బొల్లికుంట నుంచి సంగెం మండలం గనిచర్ల వరకు 8కి.మీ. మేరకు దేవాదుల కాలు నీటిని, పనులను ఆయన పరిశీలిస్తారు. ఉదయం 6గంటలకు బయలు దేరనున్నారు. ఆయన వెంట వరంగల్‌ ఎంపి పసునూరి దయాకర్‌, పరకాల ఎమ్మెల్యే చల్లాధర్మారెడ్డి పర్యటిస్తారు. ఈనెల 14న స్టేషన్‌ ఘనపూర్‌ నియోజక వర్గం ధర్మసాగర్‌ రిజర్వాయర్‌ నుంచి నీటిని విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ కాలువ ద్వారా పారుతున్న నీటితోపాటు కాలువ పనితీరును మంత్రి స్వయంగా పరిశీలించాలని నిర్ణయించారు. మంత్రి వెంట ప్రజా ప్రతినిధులతో పాటు నీటి పారుదల శాఖ అధికారులు కూడా పాల్గొంటారు. 

Updated Date - 2020-05-18T00:37:33+05:30 IST