ఉద్యమంలా మొక్కలు నాటే కార్యక్రమం- ఎర్రబెల్లి

ABN , First Publish Date - 2020-06-23T00:24:57+05:30 IST

ముఖ్యమంత్రి కేసీఆర్‌ నేతృత్వంలో తెలంగాణ ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా అత్యంత ప్రతిస్టాత్మకంగా చేపట్టిన తెలంగాణకు హరితహారం కార్యక్రమాన్ని ఒక ఉద్యమంలా నిర్వహించాలని పంచాయితీరాజ్‌, గ్రామీణాభివృద్దిశాఖ మంత్రి ఎర్రబెల్లిదయాకర్‌రావు పిలుపునిచ్చారు.

ఉద్యమంలా  మొక్కలు నాటే కార్యక్రమం- ఎర్రబెల్లి

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కేసీఆర్‌ నేతృత్వంలో తెలంగాణ ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా అత్యంత ప్రతిస్టాత్మకంగా చేపట్టిన తెలంగాణకు హరితహారం కార్యక్రమాన్ని ఒక ఉద్యమంలా నిర్వహించాలని పంచాయితీరాజ్‌, గ్రామీణాభివృద్దిశాఖ మంత్రి ఎర్రబెల్లిదయాకర్‌రావు పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటే కార్యక్రమంలో ఉధృతంగా పాల్గొనాలని అన్నారు. జీవ వైవిఽధ్యం, పర్యావరణాన్ని కాపాడే విదంగా అంతా పాటుపడాలని అన్నారు. ఆరవ విడత హరితహారం ఈనెల 25వ తేదీ నుంచి నిర్వహిస్తున్న నేపద్యంలో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన చెప్పారు. సోమవారం రంగారెడ్డిజిల్లా పరిషత్‌ కార్యాలయంలో కలెక్టర్లు, జెడ్పీఛైర్మన్‌లు ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. 


ఈసందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రవ్యాప్తంగా కోట్లాది మొక్కలు నాటే , పెంచే తెలంగాణకు మరితహారం కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారని అన్నారు. 24శాతం ఉన్నఅటవీ ప్రాంతాన్ని 33శాతానికి పెంచడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు. తద్వారా వాతావరణ సమతుల్యతను కాపాడడం, జీవ వైవిధ్యాన్ని పెంపొందించి పర్యావరణ పరిరక్షణకు పాటుపడడం ,సకాలంలో వర్షాలు పడే విదంగా చేయడం వంటి అనేక ప్రయోజనలు పొందే విధంగా హరితహారం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు తెలిపపారు. ఐదవ విడత హరితహారంలో నాటిన అనేక మొక్కలు మనుగడలో ఉన్నాయని అన్నారు 


పండ్ల మొక్కలు, ఇంట్లో పెంచుకునే మొక్కలు, ఖర్జూర, ఈత , ఉసిరి, రేగు, సీతాఫలం వంటి ఫుడ్‌కోర్ట్స్‌ , గులాబీ, మందార, గన్నేరు,తులసి వంటి పువ్వులు, అలంకారానికి , దోమలు రాకుండా ఉండేందుకు వీలైన 30 రకాల మొక్కలు నర్సరీలలో పంపిణీకి సిద్దంగా ఉన్నాయని చెప్పారు. ఈ ఏడాది 15కోట్ల మొక్కలు సిద్దంగా ఉంచినట్టు మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఎం ఓఎస్‌డి హరితహారం ప్రియాక వర్గీస్‌, పంచాయితీరాజ్‌,గ్రామీణశాఖ కార్యదర్శి సందీప్‌కుమార్‌సుల్తానియా, కమిషనర్‌రఘునందన్‌రావు,ఆయా శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-06-23T00:24:57+05:30 IST