హ్యాట్రిక్‌ కొట్టారు.. శెభాష్‌ !

ABN , First Publish Date - 2020-10-01T07:12:29+05:30 IST

గ్రామీణ స్వచ్ఛ భారత్‌ మిషన్‌లో దేశంలోనే తెలంగాణ వరుసగా మూడోసారి నంబర్‌ వన్‌గా నిలవడం పట్ల పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి....

హ్యాట్రిక్‌ కొట్టారు.. శెభాష్‌ !

స్వచ్ఛ అవార్డులపై ఎర్రబెల్లికి కేసీఆర్‌ అభినందన 


హైదరాబాద్‌, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి): గ్రామీణ స్వచ్ఛ భారత్‌  మిషన్‌లో దేశంలోనే తెలంగాణ వరుసగా మూడోసారి నంబర్‌ వన్‌గా నిలవడం పట్ల పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావును ముఖ్యమంత్రి కేసీఆర్‌ అభినందించారు. అవార్డు వచ్చిన సందర్భాన్ని పురస్కరించుకుని బుధవారం దయాకర్‌రావు ప్రగతిభవన్‌లో కేసీఆర్‌ను కలిసి పుష్పగుచ్ఛం అందించి కృతజ్ఞతలు తెలిపారు. ‘రాష్ర్టాన్ని మీ శాఖల పరంగా దేశంలోనే ముందు వరుసలో నిలుపుతున్నారు’ అని కేసీఆర్‌ ఎర్రబెల్లిని అభినందించారు.సీఎస్‌ సోమేశ్‌కుమార్‌, పంచాయతీరాజ్‌-గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి సందీప్‌కుమార్‌ సుల్తానియా, కమిషనర్‌ రఘునందన్‌రావు, సీఎం కార్యదర్శి స్మితా సబర్వాల్‌ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 

Updated Date - 2020-10-01T07:12:29+05:30 IST