హరిత హారాన్ని విజయవంతం చేయాలి: ఎర్రబెల్లి
ABN , First Publish Date - 2020-06-22T09:18:43+05:30 IST
ఈ నెల 25 నుంచి ప్రారంభించనున్న హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పిలుపునిచ్చారు.

హైదరాబాద్, జూన్ 21 (ఆంధ్రజ్యోతి): ఈ నెల 25 నుంచి ప్రారంభించనున్న హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పిలుపునిచ్చారు. సీజనల్ వ్యాధులను అరికట్టడంలో భాగంగా ఆదివారం ఉదయం 10 గంటలకు 10 నిమిషాల పాటు తన స్వగృహంలో పరిశుభ్రత కార్యక్రమాల్లో మంత్రి పాల్గొన్నారు. దోమల నివారణతో పాటు డెంగ్యూ, చికెన్‌గున్యా, మలేరియా వంటి సీజనల్ వ్యాధులను అరికట్టేందుకు పరిశుభ్రత కార్యక్రమాలను చేపట్టాలని ఆయన సూచించారు.