కేసీఆర్‌లాంటి మహనీయుడ్ని నా జీవితంలో చూడలేదు: ఎర్రబెల్లి

ABN , First Publish Date - 2020-06-01T18:21:47+05:30 IST

సీఎం కేసీఆర్‌పై మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పొగడ్తల వర్షం కురిపించారు. ‘‘నా రాజకీయ జీవితంలో ఎంతో మంది నాయకులను

కేసీఆర్‌లాంటి మహనీయుడ్ని నా జీవితంలో చూడలేదు: ఎర్రబెల్లి

వరంగల్ రూరల్: సీఎం కేసీఆర్‌పై మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పొగడ్తల వర్షం కురిపించారు. ‘‘నా రాజకీయ జీవితంలో ఎంతో మంది నాయకులను, ముఖ్యమంత్రులను చూశా, కానీ కేసీఆర్ లాంటి మహనీయుడ్ని నా జీవితంలో చూడలేదు. కాళేశ్వరం ప్రాజెక్టును మూడేళ్లలో కట్టి గలగలా నీటిని పారిస్తున్న మంచి మనిషి, రైతు బాంధవుడు కేసీఆర్ అని కొనియాడారు. నాడు కరెంట్, విత్తనాలు, ఎరువుల కోసం రోడ్లపై ధర్నాలు చేసేవారు, కానీ ఇప్పుడు వద్దంటే కరెంటు, నీళ్లు వస్తున్నాయన్నారు. వ్యవసాయం దండగ అన్న రోజులు పోయి వ్యవసాయం పండగ అన్న రోజులు వచ్చాయి. రైతుకు అండగా నిలిచేందుకు ప్రాజెక్టుల్లో నీళ్లు ఎత్తిపోస్తూ వేల కోట్ల రూపాయల కరెంట్ బిల్లులు ప్రభుత్వం చెల్లిస్తోంది. మార్కెట్‌లో డిమాండ్ ఉన్న పంటలను పండిద్దాం, మనకు మనం ఆర్థికంగా ఎదుగుదాం. సీఎం ఆశయానికి అండగా నిలిచి పంటలు వేయండి. వాటిని కొనే బాధ్యతను మేము తీసుకుంటాం. సీఎం కేసీఆర్ గారు ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు తగ్గించి రైతులకు రుణమాఫీ, రైతుబంధు డబ్బులు విడుదల చేశారు’’. అని మంత్రి స్పష్టం చేశారు.


అంతకముందు నడికుడ మండలం వరికోలులో రైతు వేదిక, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు శంకుస్థాపన, ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాన్ని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పాల్గొన్నారు. అనంతరం పారిశుద్ధ్యంపై గ్రామస్తులకు అవగహన కల్పించారు.

Updated Date - 2020-06-01T18:21:47+05:30 IST