కరోనా కట్టడిలో టీ.సర్కార్ ముందంజ: మంత్రి ఎర్రబెల్లి

ABN , First Publish Date - 2020-05-13T17:46:23+05:30 IST

కరోనా కట్టడిలో టీ.సర్కార్ ముందంజ: మంత్రి ఎర్రబెల్లి

కరోనా కట్టడిలో టీ.సర్కార్  ముందంజ: మంత్రి ఎర్రబెల్లి

వరంగల్: కరోనాను కట్టడి చేయడంలో తెలంగాణ ప్రభుత్వం ముందంజలో ఉందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. కష్ట కాలంలో రాష్ట్ర ప్రజలకు అండగా ఉంటున్నామని తెలిపారు. కరోనా కష్టాలు వచ్చినా.. రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలను ఆపలేదన్నారు. రైతులకు అండగా రైతుబంధు, రుణమాఫీ చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని మంత్రి అన్నారు. ఎన్నికల్లో ఖర్చు పెట్టడం గొప్పకాదని... మనసున్న నాయకుడే కష్ట కాలంలో ప్రజలను ఆదుకునే వాడే అసలైన నాయకుడని తెలిపారు. ప్రజలంతా కరోనాను కట్టడి చేసేందుకు మరింత జాగ్రత్తగా ఉండాలన్నారు. మాస్కులు ధరించాలని.. చేతులు కడుక్కోవాలని మంత్రి ఎర్రబెల్లి సూచించారు. 


బుధవారం ఉదయం జిల్లాలోని వర్ధన్నపేట నియోజక వర్గ కేంద్రంలో నిరుపేదలైన ఆటో కార్మికులకు మంత్రి  ఎర్రబెల్లి నిత్యావసర స్తువులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అరూరి రమేష్, డి.సి.సి.బి చైర్మెన్ మర్నేని రవీందర్ రావు పాల్గొన్నారు. 

Read more