నూటికి నూరుశాతం మొక్కలు పెరగాలన్నదే కేసీఆర్‌ లక్ష్యం- ఎర్రబెల్లి

ABN , First Publish Date - 2020-06-25T20:24:27+05:30 IST

రాష్ట్రంలో హరితహారం కార్యక్రమంలో భాగంగా నాటే మొక్కలన్నీ కూడా పెరగాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్‌ లక్ష్యమని పంచాయితీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పేర్కొన్నారు.

నూటికి నూరుశాతం మొక్కలు పెరగాలన్నదే కేసీఆర్‌ లక్ష్యం- ఎర్రబెల్లి

వరంగల్‌ రూరల్‌: రాష్ట్రంలో హరితహారం కార్యక్రమంలో భాగంగా నాటే మొక్కలన్నీ కూడా పెరగాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్‌ లక్ష్యమని పంచాయితీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పేర్కొన్నారు. తెలంగాణ పచ్చదనంతో కళకళలాడాలన్నదే ముఖ్యమంత్రి సంకల్పమన్నారు. దేశానికి తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలుస్తోందని చెప్పారు. ఆరో విడత తెలంగాణకు హరితమారం కార్యక్రమంలో భాగంగా వరంగల్‌ రూరల్‌ జిల్లా పరకాల నియోజక వర్గంలోని గీసుకొండ మండలం మరియపురం క్రాస్‌రోడ్డు నుంచి చేలపర్తి గ్రామం వరకూ 14. కి.మీ. మేర మొక్కలు నాటే హరితహారం కార్యక్రమాన్ని పరకాల ఎమ్మెల్లే చల్లాధర్మారెడ్డితో కలిసి మంత్రి ప్రారంభించారు. ఆ తర్వాత వరంగల్‌ రూరల్‌ జిల్లా నర్సంపేట నియోజక వర్గం గిర్నబావి వద్ద ఎమ్మెల్యే పెద్దిసుదర్శన్‌రెడ్డితో కలిసి మొక్కలు నాటారు. 


ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ నూటికి నూరు శాతం మొక్కలు మనుగడ సాధించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. గతంలో 85శాతం మాత్రమే మొక్కలు బతికేవీలుండేది. ఇప్పుడు నూరుశాతం బతికేలా చర్యలు తీసుకోవాలన్నారు. పంచాయితీరాజ్‌ చట్టాన్ని, హరితహారం పక డ్బందీగా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అన్నిశాఖల వారీగా మొక్కలు నాటుతున్నట్టు చెప్పారు. మొక్కలను మనుగడ సాధించేలా చూసే బాధ్యత అధికారులు, ప్రజా ప్రతినిధులదేనని అన్నారు. నిర్లక్ష్యం వహించే అధికారులు, ప్రజా ప్రతినిదులపై చర్యలు తప్పవని తెలిపారు. గ్రామ పంచాయితీ నిధులను మొక్కకల సంరక్షణకు వాడుకోవచ్చని సూచించారు. నరేగా నిధులను హరిత హారానికి వాడుకోవచ్చు.


మంకీ ఫుడ్‌కోర్టుల ద్వారా కోతులను అదుపులోకితెస్తామని హామీ ఇచ్చారు. చెరువుగట్లు, ఎస్సారెప్పీ కాలువలు, ప్రభుత్వ ఖాళీస్థలాలు, చెరువు శిఖాలు అన్నింటిలోనూ హరిత హారాన్నినిర్వహించ వచ్చని తెలిపారు. రైతుల ద్వారా మొక్కలు నాటే కార్యక్రమాన్ని మరింతగా ప్రోత్సహించాలన్నారు. హరితహారం దేశంలో ఎక్కడా లేని కార్యక్రమం. ఒక్క తెలంగాణలోనే అత్యంత సక్సెస్‌ఫుల్‌గా నడుస్తున్న కార్యక్రమని అన్నారు. ప్రతి ఏటా కోట్లాది మొక్కలు నాటుతూ, వాటిలో ఎక్కువ మొక్కలను బతికిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-06-25T20:24:27+05:30 IST