పీఎంజీఎస్‌వై మూడోదశ రూ. 658 కోట్ల పనులకు కేంద్రం ఆమోదం

ABN , First Publish Date - 2020-06-23T00:41:20+05:30 IST

ప్రధానమంత్రి గ్రామీణ సడక్‌యోజన(పీఎంజీఎస్‌వై) పథకం కొంద ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపినమూడోదశ, బ్యాచ్‌-1 పనులకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది.

పీఎంజీఎస్‌వై మూడోదశ రూ. 658 కోట్ల పనులకు కేంద్రం ఆమోదం

హైదరాబాద్‌: ప్రధానమంత్రి గ్రామీణ సడక్‌యోజన(పీఎంజీఎస్‌వై) పథకం కొంద ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపినమూడోదశ, బ్యాచ్‌-1 పనులకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది.  ఈ మేరకు 1,119.94 కి.మీ. మేర 152 పనులకు అనుమతులు లభించాయి. ఈమొత్తం పనులను 658.31 కోట్ల రూపాయలను నిర్వహించనున్నారు. దీంతో రోడ్లు లేని గ్రామీణ ప్రాంతాలు, ఆవాసాలు, ఏజెన్సీ ప్రాంతాలకు రోడ్లు వేసే అవకాశం కలుగుతుంది. కొత్తగా గ్రామాల నుంచి మండల కేంద్రాలకు లింక్‌ రోడ్లు కూడా వేసే వీలుంటుంది. నిర్ణీత నిబంధల మేరకు ఆయా పనులు చేపట్టడానికి వీలుంది. ఈసందర్భంగా కేంద్ర ప్రభుత్వం నుంచి తెలంగాణ గ్రామీణాభివృద్ధి, పంచాయితీరాజ్‌శాఖకు లేఖ అందింది. 


దీంతో కేంద్ర ప్రభుత్వానికి  రాష్ట్రపంచాయితీరాజ్‌,గ్రామీణాభివృద్ధి , గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిన పనులను వెంటనే ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. ఆయా పనులను నాణ్యతతో, వేగంగా పూర్తి అయ్యేవిధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. 

Updated Date - 2020-06-23T00:41:20+05:30 IST