రైతుని రాజు చేయాలన్నదే సీఎం కేసీఆర్ సంకల్పం- ఎర్రబెల్లి
ABN , First Publish Date - 2020-05-24T23:01:56+05:30 IST
తెలంగాణ వ్యవసాయం రంగంలో నూతన మార్పులు తీసుకు వస్తూ రైతులను రాజు చేయాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పమని పంచాయితీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు.

జనగామ: తెలంగాణ వ్యవసాయం రంగంలో నూతన మార్పులు తీసుకు వస్తూ రైతులను రాజు చేయాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పమని పంచాయితీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. అన్నంపెట్టే రైతు బాగుంటేనే దేశం సుభిక్షంగా ఉంటుందని అన్నారు. జనగామ జిల్లా కేంద్రంలో నియంత్రిత పంటల సాగుపై రైతుబంధు సమితి, మండల సమన్వయకర్తలకు, వ్యవసాయశాఖ అధికారులకు అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅధిగా మంత్రి ఎర్రబెల్లి హాజరయ్యారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులను సంఘటితం చేస్తేనే రైతు రాజ్యం వస్తుందని, ప్రభుత్వం చెప్పిన పంటలనే వేయాలని అన్నారు. ప్రపంచంతో పోటీపడదాం, మన భూముల్లో పసిడి పంటలు పండిద్దామన్నారు. విభిన్న నేలలు, సమ శీతల వాతావరణం, మంచి వర్షపాతం, మంచి నైపుణ్యం కలిగిన రైతులు ఉన్నారని చెప్పారు. రైతుల గురించి ఆలోచించే సీఎం కేసీఆర్, ప్రభుత్వం ఉండడం మన అదృష్టమని అన్నారు.
రుణమాఫీలు, పంట పెట్టుబడులు, అందుబాటులో విత్తనాలు, ఎరువులు, సాగునీరు, 24గంటల ఉచిత విద్యుత్, పంటల, రైతుల బీమా వంటి అనుకూలాంశాలు దేశంలో ఎక్కడా లేవని అన్నారు. అన్నీ ఆలోచించే నియంత్రిత పంటల విధానం పంటల ప్రణాళిక ప్రభుత్వమే మన భూములు, భూసారాలపై పరిశోదనలు చేయిందని మంత్రి పేర్కొనారు వ్యవసాయ శాస్త్రవేత్తల సూచనల మేరకే పంటల ప్రణాళిక అమలుచేస్తున్నట్టు తెలిపారు. అలాగే డిమాండ్, నాణ్యత ఉన్నపంటలనే సాగు చేద్దామని అన్నారు. ఈసందర్భగా కార్యక్రమంలో పాల్గొన్న రైతుబంధు సమితిఛైర్మన్ పల్లారాజేశ్వరరెడ్డి మాట్లాడుతూ పోతిరెడ్డిపాడుకు పొక్కలు పెట్టింది కాంగ్రెస్, టీడీపీలేనని అన్నారు. తెలంగాణకు అన్యాయం చేసింది కూడా ఆ రెండుపార్టీలేనని ఆరోపించారు.