కరోనా పై పాటను ఆవిష్కరించిన మంత్రి ఎర్రబెల్లి

ABN , First Publish Date - 2020-05-18T19:37:00+05:30 IST

తెలంగాణ సాంస్కృతిక సారధి కళాకారుడు కనకరాజు కరోనాపై రాసిన పాటని పంచాయితీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సోమవారం మంత్రుల నివాసంలో ఆవిష్కరించారు.

కరోనా పై పాటను ఆవిష్కరించిన మంత్రి ఎర్రబెల్లి

హైదరాబాద్‌: తెలంగాణ సాంస్కృతిక సారధి కళాకారుడు కనకరాజు కరోనాపై రాసిన పాటని పంచాయితీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సోమవారం మంత్రుల నివాసంలో ఆవిష్కరించారు. ఈసందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ కరోనా పై అన్నిరకాల యుద్ధం జరుగుతన్నదని అన్నారు. అందులో సాంస్కృతిక యుద్ధం కూడా ఒకటని పేర్కొన్నారు. అనేక మంది కవులు, కళాకారులు కూడా తమ కవితలు, పాటలతో కరోనాపై పోరుకు తమదైన పదాల బాణాలతో ఎక్కుపెట్టారని అన్నారు. కనక రాజు రాసిన పాట కూడా బాగుందని చెప్పారు. మరింత మంది కవులు, కళాకారులు ఇలాంటి పాటలతో కరోనా కట్టడి కోసం ప్రజలను చైతన్య పరచాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వం కరోనా నిర్మూలనకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నదని మంత్రి తెలిపారు. ప్రజలు ఎవరికి వారు స్వీయ నియంత్రణ పాటించాలని, ఇళ్లనుంచి బయటకు రాకుండా ఉండాలని, ఒకవేళ బయటరకు రావల్సి వస్తే మాస్క్‌తప్పని సరిగా ధరించాలన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో అన్నివర్గాలు కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ కరోనా బారిన పడకుండా చూసుకోవాలన్నారు. 

Updated Date - 2020-05-18T19:37:00+05:30 IST