గ్రామాల్లోనూ పరిసరాల పరిశుభ్రత కార్యక్రం తీసుకోవాలి-ఎర్రబెల్లి
ABN , First Publish Date - 2020-05-17T20:23:36+05:30 IST
మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్ ప్రకటించిన ప్రతి ఆదివారం 10గంటలకు పదినిమిషాలు కార్యక్రమాన్ని నగరాల్లోనే కాకుండా గ్రామాల్లోనూ ప్రారంభిస్తే పరిసరాలు మరింత పరిశుభ్రంగా ఉంచుకోవడానికి అవకాశం ఉంటుందని పంచాయితీ, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు.

హైదరాబాద్: మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్ ప్రకటించిన ప్రతి ఆదివారం 10గంటలకు పదినిమిషాలు కార్యక్రమాన్ని నగరాల్లోనే కాకుండా గ్రామాల్లోనూ ప్రారంభిస్తే పరిసరాలు మరింత పరిశుభ్రంగా ఉంచుకోవడానికి అవకాశం ఉంటుందని పంచాయితీ, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. ఇది ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ఇచ్చిన పిలుపు అని ప్రతి ఒక్కరూ పాటించాలన్నారు. ఆదివారం తన నివాసంలో మనవరాళ్లతో కలిసి పరిసరాల పరిశుభ్రత కార్యక్రమంలో భాగంగా ఇంట్లో చెట్లపొదల్లోని చెత్తను ఏరివేశారు. అలాగే ఇంట్లో నీటి నిల్వలు లేకుండా చేశారు. నీటి నిలువలున్న చోట్లతీసేసి శుభ్ర పరిచారు. చెత్తాచెదారం తీసేసి దోమలు లేకుండా జాగ్రత్తలు తీసుకున్న్నారు.
ఈసందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ ప్రతి ఆదివారం పది గంటలకు పది నిమిషాల కార్యక్రమాన్ని సామాజిక ఉద్యమంగా చేపట్టాలన్నారు. దోమల నివారణతో మలేరియా, డెంగీ వంటి అనేక వ్యాధులను రాకుండా నివారించాలన్నారు. మన ఇంటితోపాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా రాష్ర్టాన్ని, దేశాన్ని రోగరహితంగా ఉంచడమే కాకుండా ఆరోగ్యంగా ఉంచవచ్చన్నారు. నగరంతో పాటు, గ్రామాల్లోనూ ఈ కార్యక్రమాన్ని చేపట్టాలన్నారు. కేవలం విఐపిలకే కాకుండా ప్రతి ఒక్కరూ ఇలాంటి కార్యక్రమాలను చేపట్టాలన్నారు. ఇప్పటికే ప్రభుత్వం పచ్చదనం-పరిశుభ్రత , పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, స్వచ్చ హైదరాబాద్ వంటి అనేక కార్యక్రమాలను చేపట్టిందని తెలిపారు.