ప్రజల ప్రాణాలు నిలపడంలో వైద్యుల సేవలు భేష్- ఎర్రబెల్లి
ABN , First Publish Date - 2020-04-26T23:43:52+05:30 IST
ప్రజల ప్రాణాలు నిలపడంలో వైద్యులు అద్భుత మైన సేవలు అందిస్తున్నారని, కరోనా కష్టకాలంలోనూ ప్రాణాలకు తెగించి వాళ్లు అందిస్తున్న సేవలు చిరస్మరణీయమని గ్రామీణాభివృద్ధి, పంచాయితీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లిదయాకర్‌రావు అన్నారు.

మహబూబాబాద్: ప్రజల ప్రాణాలు నిలపడంలో వైద్యులు అద్భుత మైన సేవలు అందిస్తున్నారని, కరోనా కష్టకాలంలోనూ ప్రాణాలకు తెగించి వాళ్లు అందిస్తున్న సేవలు చిరస్మరణీయమని గ్రామీణాభివృద్ధి, పంచాయితీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లిదయాకర్‌రావు అన్నారు. వైద్యులకు ప్రతిపలంగా ప్రతి ఒక్కరూ చేయాల్సింది వారికి సహకరించడమేనని అన్నారు. మహబాబూబాద్‌జిల్లా (ఏరియా) దవాఖానాలో గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌తో కలిసి డాక్టర్లకు పిపిఈ కిట్లను, మాస్కులను అందజేశారు. ఈసందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ కరోనా వైరస్ మొత్తం ప్రపంచాన్నే గడగడలాడిస్తోందన్నారు. ఈ దిశలో ముఖ్యమంత్రి కేసీఆర్ సాహసంతో, ఆర్ధిక నష్టాలను సైతం లెక్కచేయకుండా ప్రజల ప్రాణాలే ముఖ్యమని భావించి లాక్‌డౌన్‌ను కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు.
కేసీఆర్ ముందుచూపు కారణంగానే మిగితా దేశాల కంటే, దేశంలోని మిగిలిన రాష్ర్టాల కంటే కూడా మనం ఎంతో మెరుగ్గా ఉన్నామని చెప్పారు. ఈసందర్భంగా మంత్రి సత్యవతి రాధోడ్ మాట్లాడుతూ వైద్యులు, సిబ్బంది, అధికారులు,పారిశుద్ద్యం కార్మికులు ప్రాణాలను పణంగా పెట్టి పనిచేస్తున్నందునే మనం మంచి స్ధితిలో ఉన్నామని అన్నారు. మనం చేయాల్సిందల్లా వాళ్లకు సహకరించడమేనని అన్నారు. మరికొంత కాలం సంయమనం పాటిస్తూ లాక్‌డౌన్ నిర్వహించుకోవాలని, ప్రస్తుతం కరోనా వైరస్ కంట్రోల్‌లో ఉందన్నారు. మహబూబాబాద్ హాస్పిటల్ అభివృద్ధికి సహకరిస్తామని ఇరువురు మంత్రులు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా తన నిధుల నుంచి మహబూబాబా్ హాస్పిటల్‌కే 80లక్షలను ఇచ్చిన ఎంపీ మాలోతు కవితను మంత్రులు అభినందించారు.