రాష్ట్రంలో ఎన్నడూ జరగనంత అభివృద్ధి జరుగుతోంది-ఎర్రబెల్లి

ABN , First Publish Date - 2020-12-30T19:49:52+05:30 IST

రాష్ట్రంలో గతంలో ఎన్నడూ జరగనంత అభివృద్ధి సీఎం కేసీఆర్‌ నేతృత్వంలో జరుగుతోందని పంచాయితీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు.

రాష్ట్రంలో ఎన్నడూ జరగనంత అభివృద్ధి జరుగుతోంది-ఎర్రబెల్లి

వరంగల్‌ రూరల్‌: రాష్ట్రంలో గతంలో ఎన్నడూ జరగనంత అభివృద్ధి సీఎం కేసీఆర్‌ నేతృత్వంలో జరుగుతోందని పంచాయితీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. రైతులకు సీఎం చే సినంతగా ఇప్పటి వరకూ ఏ ప్రభుత్వం , ఏ నాయకుడూ చేయలేదన్నారు. తెలంగాణలో రైతుల కోసం అమలు అవుతున్న అన్ని పధకాలు దేశంలో మరే రాష్ట్రంలో అమలు కావడం లేదన్నారు. సీఎం కేసీఆర్‌ రైతు పక్షపాతి కాబట్టే రైతుల సంక్షేమానికి ఆయన విశేషంగా కృషి చేస్తున్నారని అన్నారు. 


వరంగల్‌ రూరల్‌ జిల్లా రాయపర్తి మండలంలో సుడిగాలి పర్యటన నిర్వహించిన మంత్రి ఎర్రబెల్లి రూ. 1 కోటి 50లక్షల 50వేల విలువైన పలు అభివృదిఽ్ద కార్యక్రమాలకు శంకుస్ధాపన చేశారు. అలాగే రైతు వేదికలు, పల్లె ప్రకృతి వనాలు, గ్రామపంచాయతీ భవనాలు, గ్రామ పంచాయితీ షాపింగ్‌ కాంపెక్స్‌ల భవనాలకు ఆయన శంకుస్ధాపన చేశారు. ఈసందర్భంగా అడుగడుగునా మంత్రికి రైతుల నుంచి స్వాగతం లభించింది. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు ఆత్మబంఽదువుగా, ఇంటి పెద్దన్నగా వారు భావిస్తున్నారన్నారు. 


రైతాంగానికి ఉచిత విద్యుత్‌కు 10వేల కోట్ల సబ్సిడీ ఇస్తున్నదని చెప్పారు వ్యవసాయాన్ని ప్రైవేట్‌ వ్యక్తులకు అపపగించాలని కేంద్రం చూస్తున్నదని కాబట్టి రైతులు అప్రమత్తంగా ఉండాలన్నారు. మంచి చెడులను ఎంచుకుని ఆలోచించాలన్నారు. ఈ కార్యక్రమంలో వరంగల్‌ రూరల్‌ జిల్లా కలెక్టర్‌ హరిత, వివిధ శాఖల అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-30T19:49:52+05:30 IST