భ‌క్తి అనేది అదొక జీవ‌న విధాన‌ం

ABN , First Publish Date - 2020-12-28T00:03:58+05:30 IST

భ‌క్తి అనేది కేవ‌లం విశ్వాసం మాత్రమే కాద‌ని, అదొక జీవ‌న విధాన‌మ‌ని, సంక‌ల్ప బ‌లం ఉంటే సాధించ‌లేనిది లేద‌ని రాష్ట్ర పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్

భ‌క్తి అనేది అదొక జీవ‌న విధాన‌ం

తొర్రూరు: భ‌క్తి అనేది కేవ‌లం విశ్వాసం మాత్రమే కాద‌ని, అదొక జీవ‌న విధాన‌మ‌ని, సంక‌ల్ప బ‌లం ఉంటే సాధించ‌లేనిది లేద‌ని రాష్ట్ర పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు అన్నారు. తొర్రూరు ప‌ట్ట‌ణంలోని పాటిమీది ఒంకారేశ్వ‌రాల‌యంలో ఆదివారం జ‌రిగిన క‌న్ని స్వాముల‌కు అయ్య‌ప్ప దీక్ష నియమ, నిష్ట‌లు, శ‌బ‌రి యాత్ర ప్రాశ‌స్త్యాల వివ‌ర‌ణ‌, పూజా కార్య‌క్ర‌మాల్లో మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు సతీ సమేతంగా, ఎర్రబెల్లి ట్రస్ట్ చైర్ పర్సన్ ఎర్రబెల్లి ఉషతో కలిసి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. 


ఈ సందర్భంగా మొద‌టి సారి దీక్ష దీసుకున్న దాదాపు 500 మంది కన్ని స్వాములకు గురు స్వామి నరసింహారావు అయ్య‌ప్ప పూజా కార్య‌క్ర‌మాలు, నియ‌మ‌నిష్ట‌లు, శ‌బ‌రి యాత్ర‌, యాత్ర సంద‌ర్భంగా తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌లు, అయ్య‌ప్ప స్వామి ప్రాశ‌స్త్యం, కోవిడ్ నేప‌థ్యంలో తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌లను వివ‌రించారు. ఈ సంద‌ర్భంగా అయ్యప్ప స్వామి వారి విగ్రహం ఎదుట కొబ్బరికాయలు కొట్టి పూజ‌లు నిర్వ‌హించారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ 20ఏళ్లుగా నేను కూడా అయ్యప్ప స్వామి భక్తుడిని. వర్ధన్నపేట లో ఒక గుడి కూడా కట్టించాను. భక్తి శ్రద్ధలతో పని చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. కష్టాలు తీరుతాయి. మంచి జరుగుతుంది. అంతా క్షేమంగా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాని అన్నారు.


పాపాలు చేసే వాళ్లకు తాత్కాలికంగా సుఖాలు కలగవచ్చు. కానీ దీర్ఘకాలికంగా చూస్తే నిజమైన భక్తులకు ఆలస్యమైనా తప్పకుండా మంచే జరుగుతుంది. అన్నారు. భక్తి కేవలం విశ్వాసం మాత్రమే కాదు. అదొక జీవన విధానమని, అయ్యప్ప భక్తుల జీవన విధానం ఎంతో శ్రేష్ఠమైనదని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు అన్నారు.

Updated Date - 2020-12-28T00:03:58+05:30 IST