రామప్ప గుడిని సందర్శించిన మంత్రి ఎర్రబెల్లి

ABN , First Publish Date - 2020-11-15T23:46:27+05:30 IST

ములుగు జిల్లా వెంకటాపురం మండలం పాలంపేట గ్రామంలో కాకతీయులు నిర్మించిన ప్రసిద్ధ రామప్ప దేవాలయం ను సందర్శించి,

రామప్ప గుడిని సందర్శించిన మంత్రి ఎర్రబెల్లి

వరంగల్: ములుగు జిల్లా వెంకటాపురం మండలం పాలంపేట గ్రామంలో కాకతీయులు నిర్మించిన ప్రసిద్ధ రామప్ప దేవాలయం ను సందర్శించి, దేవాలయంలో గల శివలింగానికి రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మంత్రి ఎర్రబెల్లి కి పూర్ణకుంభ స్వాగతం పలికి,తీర్థ ప్రసాదాలు,స్వామి వారి పట్టు వస్త్రాలు అందించి ఆశీర్వచనం ఇచ్చారు.


రామప్ప దేవాలయ అభివృద్ధిపై  మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు జిల్లా కలెక్టర్ ఆదిత్య కి ఫోన్ చేసి మాట్లాడారు. రామప్ప అభివృద్ది విషయంలో ప్రభుత్వం కట్టుబడి ఉందని,పనుల నాణ్యత విషయంలో రాజీ పడొద్దని ఆదేశించారు.అట్లాగే అక్కడి నుండే పంచాయతీరాజ్ ఈఈ తో కూడా గ్రామానికి సంబంధించి సీసీ రోడ్ల నిర్మాణం,నిధులు తదితర అంశాలపై తగు ఆదేశాలిచ్చారు.ఈ కార్యక్రమంలో మంత్రి వెంట రాష్ట్ర ప్రణాళికా సంఘ ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్, ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, పెద్ది సుదర్శన్ రెడ్డి, స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

Updated Date - 2020-11-15T23:46:27+05:30 IST