కరోనాకు భయపడకండి...తీవ్రత తగ్గింది: ఎర్రబెల్లి
ABN , First Publish Date - 2020-11-03T20:05:31+05:30 IST
కరోనాకు భయపడకండి... తీవ్రత తగ్గింది... నియోజకవర్గంలో కరోనా కేసులు రోజు రోజుకి తగ్గుముఖం పడుతున్నాయి...భయపడాల్సిన పనిలేదు.
పాలకుర్తి: కరోనాకు భయపడకండి... తీవ్రత తగ్గింది... నియోజకవర్గంలో కరోనా కేసులు రోజు రోజుకి తగ్గుముఖం పడుతున్నాయి...భయపడాల్సిన పనిలేదు...అంటూ ఒకవైపు కరోనా బాధితులు దైర్యం కల్పిస్తూ మరోవైపు కరోనా బాధితులు నిరుపేదలు ఉంటే వారిని ఆదుకోవాలని ప్రజాప్రతినిధులకు ఆదేశిస్తూ... తనదైన శైలిలో రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామిణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా టెలీ కాన్ఫరెన్స్ లో మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ కరోనా కేసులు పాలకుర్తి నియోజకవర్గంలో రోజు రోజుకి తగ్గుతున్నాయి కాబట్టి భయపడాల్సిన పని లేదన్నారు. గత రెండు మూడు రోజులుగా పాలకుర్తి నియోజకవర్గంలో మొత్తం అయిదారు కేసులు నమోదవ్వడం మంచి పరిణామమన్నారు.కరోనా మహమ్మారి పూర్తిగా తొలగిపోయే వరకు మాస్కులు ధరిస్తూ, భౌతిక దూరం పాటిస్తూ తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.