అందరికీ ఏదో ఒక రోజు రిటైర్మెంట్ అనివార్యమే: ఎర్రబెల్లి

ABN , First Publish Date - 2020-10-24T22:22:55+05:30 IST

అందరికీ ఏదో ఒక రోజు రిటైర్మెంట్ అనివార్యమని,

అందరికీ ఏదో ఒక రోజు రిటైర్మెంట్ అనివార్యమే: ఎర్రబెల్లి

పర్వతగిరి: అందరికీ ఏదో ఒక రోజు రిటైర్మెంట్ అనివార్యమని, పని చేసినన్ని రోజులు ఎలా పని చేశామన్నదే ముఖ్యమని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. తన కాన్వాయ్ లో పైలట్ పిఎస్ఓ గా పని చేస్తున్న కుమార స్వామి ఈ నెలాఖరున రిటైర్మెంట్ అవుతున్నారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి ఆయన్ని పర్వతగిరిలోని తన క్యాంపు కార్యాలయంలో శనివారం నాడు శాలువాతో సత్కరించారు. 38 ఏళ్ళుగా సర్వీస్ చేస్తున్న కుమారస్వామి ఎఆర్ ఎస్ ఐ గా ఎదిగారు.


గత కొంత కాలంగా మంత్రి పైలట్ వెహికిల్ ఇన్ చార్జీగా ఉన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, సుదీర్ఘమైన వృత్తి జీవితాన్ని విజయవంతంగా ముగిస్తున్నందుకు కుమారస్వామిని అభినందించారు. ఆయన పదవీ విరమణానంతర జీవితం కూడా సంతోషంగా, ఆయు ఆరోగ్యాలతో గడవాలని ఆకాంక్షించారు.

Updated Date - 2020-10-24T22:22:55+05:30 IST