ప‌ట్ట‌భ‌ద్రులంతా టీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టాలి:ఎర్ర‌బెల్లి

ABN , First Publish Date - 2020-10-07T21:10:05+05:30 IST

ప‌ట్ట‌భ‌ద్రులంతా టీఆర్ఎస్ పార్టీ కి పట్టం కట్టాలని రాష్ట్ర పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి స‌ర‌ఫ‌రాశాఖ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు అన్నారు.

ప‌ట్ట‌భ‌ద్రులంతా టీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టాలి:ఎర్ర‌బెల్లి

కొడకండ్ల: ప‌ట్ట‌భ‌ద్రులంతా టీఆర్ఎస్ పార్టీ కి పట్టం కట్టాలని రాష్ట్ర పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి స‌ర‌ఫ‌రాశాఖ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు అన్నారు. కొడకండ్ల మండ‌ల కేంద్రంలో ప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక‌ల ఇన్ చార్జీలు, పార్టీ శ్రేణుల‌తో స‌మావేశ‌మ‌య్యారు. ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప‌ట్ట‌భ‌ద్రుల ఓట్ల‌ను న‌మోదు చేయాల‌న్నారు. వాళ్ళంతా టిఆర్ఎస్ కే ఓట్లు వేసే విధంగా చూసుకోవాల‌న్నారు. టిఆర్ఎస్ పార్టీ ప్ర‌భుత్వం చేసిన‌ అభివృద్ధి ప‌నులు, అభివృద్ధి-సంక్షేమ ప‌థ‌కాల‌ను ప్ర‌జ‌ల్లోకి బ‌లంగా తీసుకెళ్ళాల‌ని, విస్తృతంగా ప్రచారం చేయాల‌న్నారు. అలాగే, ఆయా ఓట‌ర్లు టిఆర్ ఎస్ కే ఓట్లు వేసే విధంగా జాగ్ర‌త్త వ‌హించాల‌న్నారు. పార్టీ శ్రేణులు, ఇన్ చార్జీలు ఒక్కొక్క‌రితో మంత్రి స్వ‌యంగా మాట్లాడి వారి స‌మ‌స్య‌లు తెలుసుకున్నారు. వాటిని అక్క‌డిక‌క్క‌డే ప‌రిష్క‌రించారు. 

Read more