ప్రజల ఆస్తులకు హక్కు, భద్రత కల్పించేందుకే నిర్మాణాల నమోదు- ఎర్రబెల్లి

ABN , First Publish Date - 2020-10-01T22:49:55+05:30 IST

ప్రజల ఆస్తులపై హక్కులతో పాటు వాటికి భద్రత కల్పించడానికే రాష్ట్రంలోని ప్రతి కుటుంబ వివరాలు నిర్మాణాలను నమోదుచేస్తున్నామని పంచాయితీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు.

ప్రజల ఆస్తులకు హక్కు, భద్రత కల్పించేందుకే నిర్మాణాల నమోదు- ఎర్రబెల్లి

హైదరాబాద్‌: ప్రజల ఆస్తులపై హక్కులతో పాటు వాటికి భద్రత కల్పించడానికే రాష్ట్రంలోని ప్రతి కుటుంబ వివరాలు నిర్మాణాలను నమోదుచేస్తున్నామని పంచాయితీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. వ్యవసాయ తరహాలోనే వ్యవసాయేతర ఆస్తులకు కూడా పట్టాదార్‌ పాసుపుస్తకాఉ ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నదని మంత్రి తెలిపారు. సీఎం కేసీఆర్‌ఆలోచనలకనుగుణంగా రెవెన్యూ చట్టంలో భాగంగా , చరిత్రలో ఇదో మైలురాయిగా నిలుస్తుందని మంత్రి తెలిపారు. ఈ నెల 10వ తేదీలోగా ఆయా గ్రామ పంచాయితీల పరిధిలోని నిర్మాణాల నమోదుపకడ్బందీగా పూర్తిచేయాలని మంత్రి ఆదేశించారు. గ్రామ పంచాయితీల్లో నిర్మాణాల నమోదు పై అడిషనల్‌ కలెక్టర్లు, జెడ్పీసీఈవోలు , డిసిఓలతో మంత్రి ఎర్రబెల్లి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. 


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధరణి పోర్టల్‌  దసరా సందర్భంగా ప్రారంభమవుతుందని కేసీఆర్‌ చెప్పారని ఆలోగా ప్రతి గ్రామంలో నిర్మాణాలు, కుటుంబాల వివరాలన్నీ తప్పులకు తావులేకుండా పకడ్బందీగా నమోదు చేయాలని చెప్పారు. ఇంటి యజమానుల నుంచి ఆధార్‌ నెంబర్‌ ,ఫోన్‌నెంబర్‌  ఖచ్చితంగా తీసుకోవాలన్యానరు ఒక వేళ యజమాని గనుక చనిపోతే ఎలాంటి వివాదాలకు తావులేకుండా అతని వారసుల పేరు మీద మ్యూటేషన్‌ చేయాలి. వ


్యవసాయ భూముల్లో నిర్మించిన అన్ని ఆస్తులను కూడా నమోదు చేయాలని మంత్రి ఆదేశించారు. ఇందుకోసం ఒక యాప్‌ను అందుబాటులోకి తీసుకు వస్తామన్నారు. అధికారులందరూ వారి పరిధిలోని ప్రజా ప్రతినిధులతో సమన్వయం చేసుకోవాలన్నారు. ఈ సమావేశంలో పంచాయితీరాజ్‌శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌ కుమార్‌ సుల్తానియా, కమిషనర్‌ రఘునందన్‌రావు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-10-01T22:49:55+05:30 IST