రక్తదానం చేయడంతో అనారోగ్యాలు రావు:ఎర్రబెల్లి
ABN , First Publish Date - 2020-09-21T01:03:54+05:30 IST
రక్తదానంతో అనేక మందిని కాపాడవచ్చని, ఆపదలో ఉన్న వాళ్ళకి రక్తం ఎంతో అవసరమని, ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.

హైదరాబాద్: రక్తదానంతో అనేక మందిని కాపాడవచ్చని, ఆపదలో ఉన్న వాళ్ళకి రక్తం ఎంతో అవసరమని, ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. వరంగల్ ఎనుమాముల మార్కెట్ లో మన అగ్రిటెక్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రస్తుత కరోనా సమయంలో రక్తం ఎంతో ముఖ్యమైనదన్నారు. ప్లాస్మాతో అనేక మందిని కాపాడే అదృష్టం అందరికీ రాదన్నారు. రక్తదానం చేయడం వల్ల అనారోగ్యాలు రావన్నారు. రక్తదానం చేసిన ప్రతి ఒక్కరినీ మంత్రి స్వయంగా వారి వద్దకు వెళ్ళి ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ సదానంద్, సభ్యులు, రైతులు, కమీషన్ ఏజెంట్లు, ఆగ్రిటెక్ ప్రతినిధులు, బాధ్యులు తదితరులు పాల్గొన్నారు.