సీఎం రిలీఫ్ ఫండ్‌కు స్ర్తీనిధి ఉద్యోగుల ఒక రోజు వేతనం విరాళం
ABN , First Publish Date - 2020-08-12T21:34:14+05:30 IST
గ్రామీణాభివృద్ధి శాఖలోని పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో పనిచేస్తున్న స్ర్తీనిధి ఉద్యోగులు తమ ఒక రోజు వేతనాన్ని కరోనా బాఽధితులకు ఉపయోగించడానికి వీలుగా ముఖ్యమంత్రి సహాయి నిధికి అందజేశారు.

హైదరాబాద్: గ్రామీణాభివృద్ధి శాఖలోని పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో పనిచేస్తున్న స్ర్తీనిధి ఉద్యోగులు తమ ఒక రోజు వేతనాన్ని కరోనా బాఽధితులకు ఉపయోగించడానికి వీలుగా ముఖ్యమంత్రి సహాయి నిధికి అందజేశారు. ఒక రోజు వేతనం రూ. 4లక్షల చెక్కును రాష్ట్రపంచాయితీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు బుధవారం ప్రగతి భవన్‌లో ఐటీ, మున్సిపల్‌శాఖ మంత్రి కె.తారక రామారావుకు అందజేశారు. ఈసందర్భంగా మంత్రి కేటీఆర్ స్ర్తీనిధి బ్యాంకు ఉద్యోగులను అభినందించారు. అలాగే మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ చిరుద్యోగులైనప్పటికీ వాళ్లంతా తమ ఔదార్యాన్ని చాటుకున్నారని ప్రశంసించారు. కాగా స్ర్తీనిధి మహిళా బ్యాంకులో 425 మంది ఉద్యోగులు ఉన్నారు. వాళ్లంతా తమ నెల జీతంలోని ఒక రోజు వేతనాన్ని సీఎంఆర్‌ఎఫ్‌కు అందజేశారు.