అనాధ పిల్లల వార్త చూసి చలించిన మంత్రి ఎర్రబెల్లి

ABN , First Publish Date - 2020-08-01T20:57:23+05:30 IST

యాదాద్రి జిల్లా ఆత్మకూరు గ్రామంలో గట్టుసత్తయ్య, ఆయన భార్య అనూరాధ మృతి చెందడంతో అనాధలుగా మారిన ముగ్గురు పిల్లల వార్త చూసి పంచాయితీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లిదయాకర్‌రావు చలించిపోయారు.

అనాధ పిల్లల వార్త చూసి చలించిన మంత్రి ఎర్రబెల్లి

హైదరాబాద్‌: యాదాద్రి జిల్లా ఆత్మకూరు గ్రామంలో గట్టుసత్తయ్య, ఆయన భార్య అనూరాధ మృతి చెందడంతో అనాధలుగా మారిన ముగ్గురు పిల్లల వార్త చూసి పంచాయితీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లిదయాకర్‌రావు చలించిపోయారు. ఆయన వెంటనే సంఘటన జరిగిన గ్రామసర్పంచ్‌, నియోజక వర్గ ఎమ్మెల్యే గొంగిడిసునీత,కు ఫోన్‌చేసి ఆ సంఘటన గురించి తెలుసుకున్నారు. వెంటనే ఆపిల్లలను దత్తత తీసుకోవాలని ప్రముఖ సినిమా నిర్మాత దిల్‌రాజుకుఫోన్‌చేసి కోరారు. మంత్రి కోరడంతో ఆ పిల్లలను దత్తత తీసుకుంటానని దిల్‌రాజు మాటిచ్చారు. పిల్లలను దత్తత తీసుకున్నదిల్‌రాజును మంత్రి ఎర్రబెల్లి అభినందించారు. యాదాద్రి జిల్లా ఆత్మకూరు గ్రామంలో గట్టు సత్తయ్య, కుటుంబం కొన్నేళ్లుగా జీవిస్తున్నది. కానీ అనారోగ్యం కారణంగా గత సంవత్సరం గట్టుసత్తయ్య చనిపోవడంతో భార్య అనూరాధ కూలీ పనిచేఇ పిల్లలు మనోహర్‌, లాస్య, యశ్వంత్‌ను పోషించుకుంటోంది.

Updated Date - 2020-08-01T20:57:23+05:30 IST