అంటు వ్యాధులపై జాగ్రత్త అవసరం- మంత్రి ఎర్రబెల్లి
ABN , First Publish Date - 2020-07-19T22:25:15+05:30 IST
వర్షాలుభారీగా కురుస్తున్ననేపధ్యంలో అంటు వ్యాదులు ప్రబలకుండా ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పంచాయితీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు.

జనాగామ: వర్షాలుభారీగా కురుస్తున్ననేపధ్యంలో అంటు వ్యాదులు ప్రబలకుండా ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పంచాయితీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. ప్రపంచం కరోనా వైరస్‌తో అతలాకుతలం అవుతున్నది. కాబట్టి ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలన్నారు. ఇంటితోపాటుపరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా రాష్ర్టాన్ని దేశాన్ని రోగరహితంగా ఉంచవచ్చన్నారు. ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి ఆదివారం పది గంటలకు పది నిమిషాలు కార్యక్రమంలో భాగంగా మంత్రి ఎర్రబెల్లి పర్వతగిరిలోని తన నివాసంలో కుటుంబ సభ్యులతో కలిసి పారిశుద్ధ్యం పనులు చేశారు. ఇంట్లో మొక్కలకు పాదుతీయడం, మొక్కలకు నీళ్లుపట్టడం, ఇంట్లో నీటి నిల్వ లేకుండా తగిన చర్యలు తీసుకున్నారు. నీరునిల్వ ఉన్నచోట వాటిని తీసేసి శుభ్ర పరిచారు. చెత్తాచెదారం లేకంఉడా జాగ్రత్తలుతీసుకున్నారు.
ఈసందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ ఐటీశాఖ మంత్రి కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి ఒక్కరూ పరిసరాల పరిశుభ్రత పై శ్రద్ధ వహించాలన్నారు. దోమల వల్ల మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధులు వ్యాపించే అవకాశం వుందని, కాబట్టి తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఇప్పటికే ప్రభుత్వం పచ్చదనం, పరిశుభ్రత ,పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, స్వచ్చహైదరాబాద్, స్వచ్చ తెలంగాణ వంటి అనేక కార్యక్రమాలు చేపట్టిందన్నారు. ఆయా కార్యక్రమాల అమలు వల్ల రాష్ట్రంలో కరోనా అదుపులో ఉందన్నారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న హరితహారం కార్య క్రమాన్ని ప్రజలు భాగస్వాములై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.