ఉమ్మడి జిల్లాల్లో ప్రారంభోత్సవానికి రెడీగా టీఆర్‌ఎస్‌ కార్యాలయాలు

ABN , First Publish Date - 2020-07-18T20:51:09+05:30 IST

టీఆర్‌ఎస్‌పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి జిల్లాకు పార్టీ కార్యాలయంలో భాగంగా ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో ప్రస్తుతం మూడు పార్టీకార్యాలయాలు ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నాయని పంచాయితీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లిదయాకర్‌రావు తెలిపారు.

ఉమ్మడి జిల్లాల్లో ప్రారంభోత్సవానికి రెడీగా టీఆర్‌ఎస్‌ కార్యాలయాలు

జనగామజిల్లా: టీఆర్‌ఎస్‌పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి జిల్లాకు పార్టీ కార్యాలయంలో భాగంగా ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో ప్రస్తుతం మూడు పార్టీకార్యాలయాలు ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నాయని పంచాయితీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లిదయాకర్‌రావు తెలిపారు. మరో మూడు కార్యాలయాలను నెల రోజుల్లోగా సిద్ధం చేస్తామన్నారు. ఆయా కార్యాలయాలను ముఖ్యమంత్రి కేసీఆర్‌, పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ల చేతుల మీదుగా ప్రారంభోత్సవాలు జరిపిస్తామని మంత్రి చెప్పారు. జనగామ పార్టీ కార్యాలయాన్ని మంత్రి దయాకర్‌రావు శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా నిర్మాణ పనులను పరిశీలించారు. సంబంధిత కాంట్రాక్టర్‌కి తగిన సూచనలు ఇచ్చారు.


ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి జిల్లాకో పార్టీ కార్యాలయాన్ని నిర్మించాలన్న పార్టీ ఆదేశాలకనుగుణంగా అత్యంత వేగంగా వరంగల్‌ ఉమ్మడి జిల్లాల్లోని భూపాలపల్లి, హన్మకొండ(వరంగల్‌), ములుగు,పార్టీ కార్యాలయాలు నిర్మాణ దశకు చేరుకున్నాయని చెప్పారు. కొద్దిరోజుల్లోనే వాటి ప్రారంభోత్సవాలను సీఎం కేసీఆర్‌, కేటీఆర్‌ల చేతుల మీదుగా జరిపిస్తామని తెలిపారు. మహబూబాబాద్‌, జనగామ జిల్లాల పార్టీ కార్యాలయాలను నెల నెలరోజుల్లో సిద్ధం చేస్తామన్నారు. పార్టీ కార్యాలయాలు ప్రారంభమైతే పార్టీ కార్యకలాపాలన్నీ అందులోనే జరుపుకునే వీలుందన్నారు. పార్టీ శ్రేణులకూ అనుకూలంగా ఉంటుందన్నారు.  

Updated Date - 2020-07-18T20:51:09+05:30 IST