లాక్‌డౌన్‌లో మంత్రి ఎర్రబెల్లి ‘ఆటవిడుపు’

ABN , First Publish Date - 2020-04-25T19:54:03+05:30 IST

లాక్‌డౌన్‌ నేపధ్యంలో ప్రముఖులంతా వారి వారిఇండ్లలోనే కాలక్షేపం చేస్తున్నారు. కొందరు ఇంట్లో రక రకాల పనులు చేస్తూ మరికొందరికి ఛాలెంజ్‌లు విసురుతున్నారు.

లాక్‌డౌన్‌లో మంత్రి ఎర్రబెల్లి ‘ఆటవిడుపు’

హైదరాబాద్‌: లాక్‌డౌన్‌ నేపధ్యంలో ప్రముఖులంతా వారి వారిఇండ్లలోనే కాలక్షేపం చేస్తున్నారు. కొందరు ఇంట్లో రక రకాల పనులు చేస్తూ మరికొందరికి ఛాలెంజ్‌లు విసురుతున్నారు. ఇక రాజకీయ నాయకులైతే ఇంట్లో ఉండడం లేదు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశంతో రాష్ట్రవ్యాప్తంగా మంత్రులు తమ శాఖల అధికారులతో సమావేశాలు, తమ నియోజక వర్గాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం, కరోనా వైరస్‌ పై అవగాహనా కార్యక్రమాలు, నిరుపేదలకు నిత్యావసర వస్తువుల పంపిణీ వంటి కార్యక్రమాలతో బిజీగా ఉన్నారు. నిత్యం   ఎంతో బిజీగా ఉంటూనే కాసింత సమయం చిక్కితే చాలు కుటుంబానికే వెచ్చిస్తున్నారు. అలా గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు గతకొన్ని రోజులుగా బిజీగా ఉన్నారు. కొంత సమయం చిక్కడంతో హైదరాబాద్‌లోని తన ఇంట్లో మనుమరాలు తన్వితో కలిసి టేబుల్‌ టెన్సిస్‌ ఆడుతూ కనిపించారు. 


ఎప్పుడూ మీటింగ్‌లు, మైకులు పట్టుకునే చేతికి టేబుల్‌టెన్నిస్‌బ్యాట్‌ వచ్చింది. నిత్యం ప్రతిపక్షాలు చేసే విమర్శలకు ప్రతిగా స్పందిస్తూ, ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రజలకు అందే లా కృషి చేస్తున్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు  కొంత సమయం చిక్కడంతో ఇంట్లోనే మనుమరాలితో టెన్నిస్‌ ఆడుతూ కనిపించడం పార్టీ నాయకులు, కార్యకర్తలు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈసందర్బంగా మంత్రి ఎర్రబె ల్లి దయాకర్‌రావు మాట్లాడుతూ లాక్‌డౌన్‌లో సమయం చిక్కతేచాలు కుటుంబ సభ్యులతో గడుపుతున్నానని చెప్పారు. కాలక్షేపం కోసం మనుమరాలితో టేబుల్‌ టెన్నిస్‌ ఆడుతున్నట్టు తెలిపారు.ఎప్పుడూ లేనిది లాక్‌డౌన్‌లోనే ఇంటి సభ్యులతో గడిపే అవకాశం ఎక్కువ వచ్చింది. ప్రజలు కూడా కరోనా మహమ్మారి బారిన పడకుండా స్వీయ నియంత్రణ పాటిస్తూ ఇంట్లోనే ఉండాలని అన్నారు  .

Updated Date - 2020-04-25T19:54:03+05:30 IST