సంకల్పబలం ఉంటే ఏదైనా సాధించవచ్చు

ABN , First Publish Date - 2020-12-28T04:52:28+05:30 IST

సంకల్పబలం ఉంటే ఏదైనా సాధించవచ్చు

సంకల్పబలం ఉంటే ఏదైనా సాధించవచ్చు
మంత్రి దయాకర్‌రావు దంపతులను దీవిస్తున్న గురుస్వామి

తొర్రూరులో కన్నెస్వాముల పూజ
పాల్గొన్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు

తొర్రూరు, డిసెంబరు 27: భక్తి అనేది విశ్వాసం మాత్రమే కాదని.. అదొక జీవన విధానం అని.. సంకల్పబలం ఉంటే ఏదైనా సాధించవచ్చని రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. తొర్రూరులోని పాటిమీద గల అయ్యప్ప ఆలయంలో ఆదివారం జరిగిన కన్నెస్వాముల పూజకు సతీమణి ఉషాదయాకర్‌రావుతో కలిసి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మొదటి సారిగా దీక్ష తీసుకున్న అయ్యప్ప స్వాములు శబరి యాత్ర, జాగ్రత్తలు, కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ యాత్ర కొనసాగించాలని తెలిపారు. 20 ఏళ్లుగా తాను కూడా అయ్యప్ప స్వామి భక్తుడినని, వర్ధన్నపేటలో అయ్యప్పస్వామి గుడి కట్టించానని తెలిపారు. భక్తిశ్రద్ధలతో పూజ చేయాలని అప్పుడే కష్టాలు తీరుతాయన్నారు. దీక్ష తీసుకున్న వారు త్రికరణ శుద్ధితో పూజలు చేయాలని, కోరుకుంటే ఫలితాలు ఉంటాయన్నారు. అయ్యప్ప భక్తుల జీవన విధానం ఎంతో శ్రేష్టమైనదని ఆయన తెలిపారు. కార్యక్రమంలో ఆలయ అర్చకులు నర్సింహమూర్తి, శివశర్మ, కృపాకర్‌ రాజు, బిందు శ్రీను, మునిసిపల్‌ చైర్మన్‌ రాంచంద్రయ్య, వైస్‌చైర్మన్‌ సురేందర్‌ రెడ్డి, జడ్పీటీసీ శ్రీనివాస్‌, వార్డు కౌన్సిలర్లు, 500 మంది భక్తులు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-28T04:52:28+05:30 IST