వన్య ప్రాణులు జనావాసంలోకి రాకుండా చర్యలు- అల్లోల

ABN , First Publish Date - 2020-05-29T21:18:20+05:30 IST

తాగునీటి కోసం వన్య ప్రాణులు జనారణ్యంలోకి రాకుండా అటవీశాఖపటిష్టమైన చర్యలు తీసుకుంటుందని అటవీ, పర్యావరణశాఖమంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు.

వన్య ప్రాణులు జనావాసంలోకి రాకుండా చర్యలు- అల్లోల

హైదరాబాద్‌: తాగునీటి కోసం వన్య ప్రాణులు జనారణ్యంలోకి రాకుండా అటవీశాఖపటిష్టమైన చర్యలు తీసుకుంటుందని అటవీ, పర్యావరణశాఖమంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. జనావాసాల్లోకి ఇటీవల కాలంలో తరచూ చిరుతపులులు, ఇతర జంతువులు వస్తున్న తరుణంలో దీనిపై మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి స్పందించారు. సాధారణంగా ఎండాకాలంలో ఆవాసాలను వదిలి నీటిని, ఆహారాన్ని వెతుక్కుంటూ వన్య ప్రాణులు జనావాసాల్లోకి వస్తుంటాయని దీనికితోడు లాక్‌డౌన్‌ వల్ల మనుషుల సంచారం, వాహనాల శబ్ధాలు కూడా తేకపోవడంతో పక్షులు, వణ్య ప్రాణులు మరింత స్వేచ్చగా విహరిస్తున్నాయని తెలిపారు. సమస్యను నివారించే చర్యల్లో భాగంగా అడవుల్లో తాగునీటి సౌకర్యం కల్పించేందుకు అటవీ అధికారులు చర్యలు తీసుకుంటున్నారని అన్నారు అభయారణ్యంలో జంతువుల దాహార్తిని తీర్చడమే లక్ష్యంగా నీటి వనరుల ఏర్పాటుకు అటవీశాఖలో ప్రత్యేకంగా ఓ విభాగం పనిచేస్తుందని వెల్లడించారు. ప్రతి వేసవిలోనూ వాగులు, వంకలు ఎండిపోయి తాగునీటికి ఇబ్బంది కలిగే పరిస్థితుల్లో అటవీ శాఖ ఆధ్వర్యంలో వాటిని కాపాడేందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నామన్నారు సోలార్‌పంప్‌ సెట్లతో పాటు సోలార్‌ పిట్లు నిర్మించి ట్యాంకర్ల ద్వారా నీటిని నింపడం వంటివి చేస్తున్నారని చెప్పారు. శాఖాహార జంతువుల కోసం గడ్డి క్షేత్రాలను కూడా ఏర్పాటు చేస్తున్నామన్నారు. వణ్య ప్రాణుల కదలికలను పసిగట్టేందుకు అటవీ ప్రాంతంలో సీసీ కెమెరాలను ఏర్పాటుచేశామన్నారు. 

Updated Date - 2020-05-29T21:18:20+05:30 IST