దక్షిణ భారత దేశంలోనే తొలి కోతుల సంరక్షణ కేంద్రం- అల్లోల

ABN , First Publish Date - 2020-12-20T20:12:17+05:30 IST

దక్షిణ భారత దేశంలోనే తొలి కోతుల సంరక్షణ కేంద్రం ఏర్పాటు కావడం ఆనందంగా ఉందని అటవీశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు.

దక్షిణ భారత దేశంలోనే తొలి కోతుల సంరక్షణ కేంద్రం- అల్లోల

ఆదిలాబాద్‌: దక్షిణ భారత దేశంలోనే తొలి కోతుల సంరక్షణ కేంద్రం ఏర్పాటు కావడం ఆనందంగా ఉందని అటవీశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. కోతులకు పునరావాస కేంద్రం ఏర్పాటుచేయడం గర్వంగా ఉందన్నారు. వానలు వాపస్‌ రావాలె.....కోతులు వాపస్‌ పోవాలె...అని సీఎం కేసీఆర్‌ ఆలోచనకు అనుగుణంగా ఈ కేంద్రం పనిచేస్తుందని ఆయన తెలిపారు. 


ఆదివారం గండి రామన్న హరిత వనంలో అటవీశాఖ అధికారులు ఏర్పాటు చేసినకోతుల సంరక్షణ, పునరావాస కేంద్రం, మూషిక జింకల పార్క్‌, చైన్‌లింక్‌, సఫారీ, గజీటో, ఎకోహట్స్‌ చిన్నపిల్లల కోసం బోటింగ్‌  వంటి అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ దశల వారీగా గ్రామ పంచాయితీల సహకారంతో కోతులను పట్టుకొచ్చి కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌ చేస్తారని, అవిపూర్తిగా కోలుకోగానే మళ్లీ అడవుల్లోకి వదిలేస్తారని వెల్లడించారు.. 


కాగా  వణ్య ప్రాణుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని, పూల చెట్లు, పండ్ల చెట్లు, నీడనిచ్చే చెట్టు, ఔషధ మొక్కలను విరివిగా నాటుతున్నామని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో పీసీసీఎఫ్‌ ఆర్‌. శోభ, జెడ్పీఛైర్మన్‌ విజయల లక్ష్మీరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-20T20:12:17+05:30 IST