రైతులను సంఘటితం చేసేందుకే రైతు వేదికల నిర్మాణం- అల్లోల
ABN , First Publish Date - 2020-12-19T21:54:54+05:30 IST
రాష్ట్రంలో రైతువేదికల నిర్మాణం, రైతు బంధు దేశానికి ఆదర్శమని పర్యావరణశాఖ మంత్రి అల్లోల ఇంంద్రకరణ్‌రెడ్డి అన్నారు.

ఆదిలాబాద్: రాష్ట్రంలో రైతువేదికల నిర్మాణం, రైతు బంధు దేశానికి ఆదర్శమని పర్యావరణశాఖ మంత్రి అల్లోల ఇంంద్రకరణ్‌రెడ్డి అన్నారు. రైతులను సంఘటితం చేసేందుకే ప్రభుత్వం రైతు వేదికలను నిర్మిస్తోందన్నారు. రైతులందరూ ఒక్కచోట చేరి తమ సాధక బాధకాలను చర్చించుకునే రైతువేదికలు ఎంతో ఉపయోగ పడతాయని అన్నారు. శనివారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మొదటి రైతు వేదికను మంత్రి నిరంజన్‌రెడ్డి, రైతుబంధు సమితి ఛైర్మన్ పల్లా రాజేశ్వరరెడ్డితో కలిసి ప్రారంభించారు.
ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం పలు సంక్షేమ పధకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తోందన్నారు. రాష్ట్రం వచ్చిన తర్వాత సాగునీటి వసతి, 24గంటల పాటు విద్యుత్‌సరఫరా, రైతు బంధు, రైతుబీమా ప్రదేశ పెట్టి రైతుల సంక్షేమం కోసం టీఆర్‌ఎస్ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. జిల్లాలో 79 రైతు వేదికలను నిర్మాణం చేస్తున్నామని, ఇప్పటి వరకూ దాదాపు పూర్తయ్యాయని చెప్పారు.
ఈకార్యక్రమంలో పాల్గొన్న వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ఆవిర్భావం తర్వాత అన్ని రంగాల్లో రాష్ట్రం అభివృద్ధి పధంలో ముందుకు పోతున్నదని చెప్పారు. తెలంగాణలో జీవ వైవిధ్యం కూడా పునర్జీవం పొసుకుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న అనేకానేక చర్యల వల్ల అంతరించిపోతున్న పశు పక్ష్యాదులు మళ్లీ కనబడుతున్నాయని అన్నారు. రైతు ఆత్మహత్యలు లేవు. దుఃఖం నుంచి దూరం అయ్యామన్నారు. 60ఏళ్ల కష్టాల నుంచి ఆరేండ్లలోనే బయట పడగలిగామని పేర్కొన్నారు.