ఆర్కే 5బి గనిలో ప్రమాదఘటనపై మంత్రి అల్లోల ఆరా

ABN , First Publish Date - 2020-09-03T20:13:41+05:30 IST

మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్‌ ఏరియా ఆర్కేబి గనిలో జరిగిన ప్రమాద ఘటన పై అటవీ,పర్యావరణశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి ఆరా తీశారు.

ఆర్కే 5బి గనిలో ప్రమాదఘటనపై మంత్రి అల్లోల ఆరా

హైదరాబాద్‌: మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్‌  ఏరియా ఆర్కేబి గనిలో జరిగిన ప్రమాద ఘటన పై అటవీ,పర్యావరణశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి ఆరా తీశారు. ఈ సంఘటన పై ప్రాధమిక వివరాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. గనిలో ప్రమాదం బాధాకరమని అన్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సహాయం అందించాలని సింగరేణి అధికారులను ఆదేశించారు. ఈ ప్రమాదంలో గని కార్మికుడు లింగయ్య మృతి చెందడం పట్ల మంత్రి విచారం వ్యక్తం చేశారు. బాధితుని కుటుంబాన్ని ఆదుకుంటామని మంత్రి భరోసా ఇచ్చారు. 

Updated Date - 2020-09-03T20:13:41+05:30 IST