ఆదిలాబాద్ కాల్పులపై ఎంఐఎం సీరియస్‌

ABN , First Publish Date - 2020-12-19T21:51:31+05:30 IST

ఆదిలాబాద్ కాల్పుల ఘటనను ఎంఐఎం పార్టీ అధిష్టానం సీరియస్‌గా తీసుకుంది. ఆదిలాబాద్‌ జిల్లాలోని ఎంఐఎం పార్టీ కమిటీలన్నింటిని రద్దు చేస్తూ ఎంఐఎం నేత అసదుద్దీన్‌ నిర్ణయం తీసుకున్నారు.

ఆదిలాబాద్ కాల్పులపై ఎంఐఎం సీరియస్‌

ఆదిలాబాద్: ఆదిలాబాద్ కాల్పుల ఘటనను ఎంఐఎం పార్టీ అధిష్టానం సీరియస్‌గా తీసుకుంది. ఆదిలాబాద్‌ జిల్లాలోని ఎంఐఎం పార్టీ కమిటీలన్నింటిని రద్దు చేస్తూ ఎంఐఎం నేత అసదుద్దీన్‌ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే కాల్పులకు పాల్పడిన ఫారుఖ్‌ను పార్టీ నుంచి తొలగించామని ప్రకటించారు. పాత కక్షలను మనసులో పెట్టుకుని.. పిల్లల క్రికెట్‌ గొడవను ఆసరాగా చేసుకుని.. ఆదిలాబాద్‌ జిల్లా ఎంఐఎం అధ్యక్షుడు, మున్సిపల్‌ మాజీ వైస్‌ చైర్మన్‌ ఫారూఖ్‌ అహ్మద్‌ (48) ప్రత్యర్థులపై కాల్పులకు తెగబడ్డాడు. తల్వార్‌తో దాడి చేశాడు. ఈ దాడిలో మన్నన్‌ (52), అతడి కుమారుడు మోథెషిన్‌ (20), జమీర్‌ (55) అనే ముగ్గురికి గాయాలయ్యాయి. ఈ ఘటనలో ఫారూఖ్‌ అహ్మద్‌ను పోలీసులు అరెస్టు చేశారు. తుపాకీని స్వాధీనం చేసుకుని ఆయుధాల చట్టం 307, 327 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. 

Updated Date - 2020-12-19T21:51:31+05:30 IST