వలస కూలీల కొరతతో ఆగిన ప్రాజెక్టులు
ABN , First Publish Date - 2020-07-27T21:05:59+05:30 IST
ఆకలి బాధలతో కన్నీటిని రాలుస్తూ వలస కూలీలు వందల కి.మీ. నడుచుకుంటూ వెళ్లారు.

హైదరాబాద్: ఆకలి బాధలతో కన్నీటిని రాలుస్తూ వలస కూలీలు వందల కి.మీ. నడుచుకుంటూ వెళ్లారు. దేశంలో జరిగిన ఎన్నో విషాదాల్లో ఇదొకటి. లాక్ డౌన్ లక్షలాదిమంది వలస కూలీల బతుకులను చిధ్రం చేసేసింది. ఇప్పుడు పరిస్థితి మారింది. నగరాలు లాక్ డౌన్ నుంచి బయటపడ్డాయి. కానీ కూలీలు దొరకడంలేదు. వెనక్కి రావాలంటూ యజమానులు.. కంపెనీలు ఆఫర్లు ఇస్తూన్నా వెనక్కి వచ్చేందుకు కూలీలు ఇష్టపడడంలేదు. ముఖ్యంగా కూలీల కొరతతో ముంబైలో చాలా ప్రాజెక్టులు ఆగిపోయాయి. రియల్ ఎస్టేట్ రంగం స్తంభించిపోయింది. కొందరు తిరిగి వచ్చినప్పటికీ చాలా మంది సొంతూరు వదిలేందుకు ఇష్టపడడంలేదు. ఈ దెబ్బతో ముంబైలోని దాదాపు 10వేల భవన నిర్మాణాలు నిలిచిపోయాయి. వలస కూలీలను తిరిగి రప్పించేందుకు ఆయా యాజమాన్యాలు అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నాయి.