ఆ బాధ్యత మాదే: మంత్రి హరీష్‌రావు

ABN , First Publish Date - 2020-04-01T01:22:18+05:30 IST

లాక్‌డౌన్‌ సమయంలో వలస కూలీలను ఆదుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం ముందుకొచ్చింది.

ఆ బాధ్యత మాదే: మంత్రి హరీష్‌రావు

సిద్దిపేట: లాక్‌డౌన్‌ సమయంలో వలస కూలీలను ఆదుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం ముందుకొచ్చింది. వలస కూలీల ఆకలి తీర్చడం తమ బాధ్యత అని తెలంగాణ మంత్రి హరీష్‌రావు అన్నారు.  మంత్రి హరీష్‌రావు స్వయంగా వెళ్లి వలస కూలీలకు 12 కిలోల బియ్యం, రూ.500 అందించారు. సిద్దిపేటలో 10,300 మంది వలస కార్మికులు ఉన్నారని హరీష్‌రావు తెలిపారు. లాక్‌డౌన్‌ సమయంలో వలస కూలీలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తామని మంత్రి చెప్పారు. కరోనా వైరస్‌ను నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా మార్చి 25 నుంచి ఏప్రిల్ 14 వరకు లాక్‌డౌన్‌ ప్రకటించింది. కరోనా వైరస్ కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది.

Updated Date - 2020-04-01T01:22:18+05:30 IST