మిడ్‌మానేరు టు కొండపోచమ్మసాగర్
ABN , First Publish Date - 2020-06-23T09:14:16+05:30 IST
కాళేశ్వరం జలాలు సిద్దిపేట జిల్లాలో పరవళ్లు తొక్కుతున్నాయి. మిడ్‌మానేరు నుంచి 3 నెలల్లో 7.6 టీఎంసీల నీటిని విడుదల చేశారు. వీటితో సిద్దిపేట-సిరిసిల్ల జిల్లాల సరిహద్దులో ఉన్న అనంతగిరి రిజర్వాయర్, సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలంలోని

- సిద్దిపేట జిల్లాలో గోదావరి పరవళ్లు
సిద్దిపేట: కాళేశ్వరం జలాలు సిద్దిపేట జిల్లాలో పరవళ్లు తొక్కుతున్నాయి. మిడ్‌మానేరు నుంచి 3 నెలల్లో 7.6 టీఎంసీల నీటిని విడుదల చేశారు. వీటితో సిద్దిపేట-సిరిసిల్ల జిల్లాల సరిహద్దులో ఉన్న అనంతగిరి రిజర్వాయర్, సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలంలోని 3టీఎంసీల రంగనాయకసాగర్ రిజర్వాయర్ జలకళను సంతరించుకున్నాయి. రంగనాయకసాగర్ నుంచి మల్లన్నసాగర్ సర్జ్‌పూల్ మీదుగా కొండపోచమ్మసాగర్ రిజర్వాయర్‌లోకి గోదావరి నీళ్లు పరుగుపెడుతున్నాయి. ప్రస్తుతం ఈ రిజర్వాయర్‌లోకి సుమారు 2టీఎంసీల నీళ్లు వచ్చిచేరాయి. సిద్దిపేట జిల్లాలోని పలు చెరువులు, చెక్‌డ్యాముల్లోకి నీటిని మళ్లించారు. దీంతో ఎటుచూసినా కాళేశ్వరం జలాలతో కాలువలు కళకళలాడుతున్నాయి.