మెట్రోను విస్తరిస్తాం: హరీష్ రావు
ABN , First Publish Date - 2020-03-08T18:07:39+05:30 IST
నగరంలో మెట్రో రైలు సర్వీస్‌ను విస్తరిస్తామని అసెంబ్లీలో ఆర్థిక మంత్రి హరీష్ రావు ప్రకటించారు. రెండో దశలో రాయదుర్గం నుంచి శంషాబాద్ వరకు మెట్రో సర్వీస్‌ను

హైదరాబాద్: నగరంలో మెట్రో రైలు సర్వీస్‌ను విస్తరిస్తామని అసెంబ్లీలో ఆర్థిక మంత్రి హరీష్ రావు ప్రకటించారు. రెండో దశలో రాయదుర్గం నుంచి శంషాబాద్ వరకు మెట్రో సర్వీస్‌ను విస్తరిస్తామని చెప్పారు. అదేవిధంగా బీహెచ్ఈఎల్ నుంచి లక్డీకపూల్ వరకు మెట్రో విస్తరిస్తామన్నారు. పాతబస్తీ పరిధిలో మిగిలిన 5 కిలోమీటర్ల మెట్రో మార్గాన్ని కూడా త్వరలోనే పూర్తి చేస్తామని చెప్పారు.