మా ఇంట్లో పెళ్లికి రావొద్దు

ABN , First Publish Date - 2020-03-21T09:55:50+05:30 IST

తమ ఇంట జరిగే పెళ్లికి రావొద్దని ఖమ్మానికి చెందిన వధూవరుల తల్లిదండ్రులు బంధుమిత్రులకు మెసేజ్‌

మా ఇంట్లో పెళ్లికి రావొద్దు

బంధుమిత్రులకు మెసేజ్‌

ఖమ్మం, మార్చి 20 (ఆంధ్రజ్యోతి): తమ ఇంట జరిగే పెళ్లికి రావొద్దని ఖమ్మానికి చెందిన వధూవరుల తల్లిదండ్రులు బంధుమిత్రులకు మెసేజ్‌ పంపారు. కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా చేపట్టిన చర్యల్లో భాగంగా ఫంక్షన్‌ హాళ్లను మూసివేస్తున్నందున ఈ నిర్ణయం తీసుకున్నామని వారు పేర్కొన్నారు. ఖమ్మంలో మొత్తం 60 ఫంక్షన్‌హాళ్లు ఉంటే ఇప్పటికే 52 మూసివేశారు. కొన్ని వివాహాల అనంతరం మిగతా వాటిని కూడా మూసివేయనున్నారు. 

Updated Date - 2020-03-21T09:55:50+05:30 IST