హరితహారం పై ప్రారంభమైన మంత్రుల సమావేశం
ABN , First Publish Date - 2020-06-22T20:31:04+05:30 IST
తెలంగాణలో ఈనెల 25వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఆరోవిడత హరితహారం కార్యక్రమాలపై పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ ఆఽధ్యక్షతన సమీక్షాసమావేశం ప్రారంభమైంది.

హైదరాబాద్: తెలంగాణలో ఈనెల 25వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఆరోవిడత హరితహారం కార్యక్రమాలపై పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ ఆఽధ్యక్షతన సమీక్షాసమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి మున్సిపల్‌శాఖ మంత్రి కె. తారక రామారావు ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. జీహెచ్‌ఎంసి ప్రధాన కార్యాలయంలో ప్రారంభమైన ఈసమావేశంలో మంత్రి మల్లారెడ్డి, మేయర్ బొంతు రామ్మోహన్,ఎంపీ రంజిత్‌రెడ్డి, జీహెచ్‌ఎంసి కమిషనర్ లోకేశ్‌కుమార్, గ్రేటర్‌పరిధిలోని ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, జీహెచ్‌ఎంసి, హెచ్‌ఎండిఏ, కలెక్టర్ ఇతర అధికారులు పాల్గొన్నారు.