జాతీయ రహదారులన్నీ పచ్చదనంతో కళకళలాడాలి

ABN , First Publish Date - 2020-06-26T23:47:47+05:30 IST

రాష్ట్రంలోని అన్నిజాతీయ రహదారులు, రాష్ట్ర రోడ్లు పచ్చదనంతో కళకళలాడేలా అవసరమైన రోడ్ల వెంటనే నర్సరీలు ఏర్పాటు చేయాలని ప్రభత్వం నిర్ణయించింది.

జాతీయ రహదారులన్నీ పచ్చదనంతో కళకళలాడాలి

హైదరాబాద్‌: రాష్ట్రంలోని అన్నిజాతీయ రహదారులు, రాష్ట్ర రోడ్లు పచ్చదనంతో కళకళలాడేలా అవసరమైన రోడ్ల వెంటనే నర్సరీలు ఏర్పాటు చేయాలని ప్రభత్వం నిర్ణయించింది. ఈమేరకు ముఖ్యమంత్రి కార్యాలయం ఆదేశాల మేరకు రాష్ట్ర అటవీశాఖ, నేషనల్‌ హైవేస్‌, ఆర్‌అండ్‌బి శాఖల అధికారులు అరణ్యభవన్‌లో సమావేశమయ్యారు. రాజన్న సిరిసిల్ల జిల్లా పర్యటనలో ఉన్న అటవీ సంరక్షణ ప్రధానాధికారి ఆర్‌,శోభ కరీంనగర్‌ నుంచి వీడియా కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ముఖ్యమంత్రి ఆదేశాలను వెంటనే అమలు చేయాలని నర్సీరీల సంఖ్య నెలకొల్పే ప్రదేశాలను వెంటనే ఖరారు చేయాలని అన్నారు. డిఎఫ్‌ఓ , హైవేస్‌ , అర్‌అండ్‌బి అధికారులు ఉమ్మడిగా ఆయా జిల్లాల్లో క్షేత్రస్థాయి పర్యటనలు చేయాలని తెలిపారు. జాతీయ రహదారుల వెంట 40 నర్సరీలు, రాష్ట్రహైవేస్‌లో 69, రోడ్లు భవనాలశాఖ పరిధిలో రహదారుల వెంట 141 మొత్తం 250 నర్సరీలను ఏర్పాటు చేయాలని సూచించారు. 


ఒక్కోనర్సరీలో 40 వేల చొప్పున మొత్తం కోటి పెద్ద మొక్కలు పెంచేలా, వాటిని అన్నిరోడ్లకు రహదారి వనాలు(ఎవెన్యూ ప్లాంటేషన్‌) కోసం ఉపయోగించాలని నిర్ణయించారు. ఈ నర్సరీల ఏర్పాటుకు ఉపాధి హామీ పథకం నుంచి నిధులను వాడుకునేలా ప్రణాళికలు సిద్ధం చేయనున్నారు. వెంటనే నర్సరీలను ప్రారంభించి వచ్చే సీజన్‌కల్లా మొక్కలు నాటేలా ప్లాన్‌ చేయాలని అధికారుల బృందం నిర్ణయించింది. సీమావేశంలో రోడ్లుభవనాలశాఖ ఈఎన్‌సీ గణపతిరెడ్డి, నేషనల్‌హైవేస్‌ ప్రాజెక్ట్స్‌ డైరెక్టర్‌ కృష్ణ ప్రసాద్‌, అన్ని జిల్లాలకు చెందిన అటవీ, ఆర్‌అండ్‌బి అధికారులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-06-26T23:47:47+05:30 IST