బీజేపీ కార్యాలయంలో ముఖ్యనేతల సమావేశం
ABN , First Publish Date - 2020-11-15T23:09:57+05:30 IST
బీజేపీ కార్యాలయంలో ముఖ్యనేతల సమావేశమయ్యారు. ఈ పార్టీ నేత బండి సంజయ్ అధ్యక్షతన జీహెచ్ఎంసీ ఎలక్షన్ మేనేజ్‌మెంట్ కమిటీ భేటీ అయింది.

హైదరాబాద్: బీజేపీ కార్యాలయంలో ముఖ్యనేతల సమావేశమయ్యారు. ఈ పార్టీ నేత బండి సంజయ్ అధ్యక్షతన జీహెచ్ఎంసీ ఎలక్షన్ మేనేజ్‌మెంట్ కమిటీ భేటీ అయింది. ఈ సమావేశంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, డీకే అరుణ, అరవింద్, లక్ష్మణ్, మురళీధరరావు పాల్గొన్నారు. వీరితో పాటు ఎమ్మెల్యేలు రాజాసింగ్, రఘునందన్‌రావు, జితేందర్ రెడ్డి, వివేక్, పొంగులేటి సుధాకర్‌రెడ్డి పాల్గొన్నారు. గ్రేటర్ ఎన్నికల ప్రణాళిక, గ్రేటర్‌లో బండి సంజయ్ పాదయాత్రపై చర్చించినట్లు సమాచారం.
బండి సంజయ్ దూకుడుతో గ్రేటర్ హైదరాబాద్‌లో బీజేపీ బలపడుతోందని కమలం పార్టీ నేతలు భావిస్తున్నారు. గ్రేటర్‌లో బీజేపీకి గతంలో కంటే స్థానాలు పెరుగుతాయని ఇటీవల టీఆర్ఎస్ శాసనసభాపక్ష సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యానించడమే.. హైదరాబాద్‌లో బీజేపీ బలంగా ఉందనటానికి నిదర్శనమని కమలం పార్టీ నేతలు ఉదహరిస్తున్నారు. మొత్తంమీద జీహెచ్ఎంసీ ఎన్నికలను అసెంబ్లీ ఎన్నికలకు సెమీఫైనల్స్‌గా భావిస్తున్న బీజేపీ.. గ్రేటర్‌పై పట్టు సాధించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సత్తా చాటితేనే.. భవిష్యత్తులో జరిగే ఎన్నికల్లో పట్టు బిగించవచ్చని భావిస్తోంది. మరి గ్రేటర్ ఎన్నికల్లో కమలం పార్టీ ఏ మేరకు వికసిస్తుందో చూడాలి.