దుబ్బాక ఉప ఎన్నికపై బీజేపీ ముఖ్యనేతల సమావేశం
ABN , First Publish Date - 2020-10-03T21:54:29+05:30 IST
దుబ్బాక ఉప ఎన్నికపై బీజేపీ ముఖ్యనేతలు సమావేశమయ్యారు. ఈ సమావేశానికి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, ఆ పార్టీ నేతలు డీకే అరుణ, లక్ష్మణ్, ఉపఎన్నిక ఇన్‌చార్జ్ జితేందర్ రెడ్డి హాజరైనారు.

హైదరాబాద్: దుబ్బాక ఉప ఎన్నికపై బీజేపీ ముఖ్యనేతలు సమావేశమయ్యారు. ఈ సమావేశానికి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, ఆ పార్టీ నేతలు డీకే అరుణ, లక్ష్మణ్, ఉపఎన్నిక ఇన్‌చార్జ్ జితేందర్ రెడ్డి హాజరైనారు. దుబ్బాక ఉప ఎన్నికలను బీజేపీ ప్రతిష్టాత్మకం తీసుకుంది. ఎలాగైన ఎన్నికల్లో గెలవాలని పావులు కదుపుతోంది. బీజేపీ నేత రఘునందన్‌రావు ఇప్పటికే ప్రచారాన్ని ముమ్మరం చేశారు. బీజేపీతోనే దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధి సాధ్యమని చెబుతున్నారు. దుబ్బాక నియోజకవర్గం ఎక్కడ అభివృద్ధి చెందిందని బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. బీజేపీకి అవకాశం ఇస్తే అభివృద్ధి చేసి చూపిస్తామని చెబుతున్నారు. నియోజకవర్గంలో బీజేపీకి ఒక్క అవకాశం కల్పించాలని ప్రజలను విజ్ఞప్తి చేశారు.
సిద్దిపేట జిల్లా దుబ్బాక ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మరణంతో దుబ్బాక అసెంబ్లీ స్థానం ఖాళీ అయిన విషయం విదితమే. దుబ్బాకతో పాటు దేశ వ్యాప్తంగా 56 అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నికల షెడ్యూల్ విడుదల చేశారు. అయితే.. తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికకు మాత్రం సీఈసీ ఇంకా తేదీలు ప్రకటించలేదు.