కృష్ణా నీటి వినియోగంపై బీజేపీ కార్యాలయంలో ముగిసి‌న సమావేశం

ABN , First Publish Date - 2020-06-01T20:35:35+05:30 IST

హైదరాబాద్: కృష్ణా నది నీటి వినియోగంపై బీజేపీ కార్యాలయంలో సమావేశం ముగిసింది.

కృష్ణా నీటి వినియోగంపై బీజేపీ కార్యాలయంలో ముగిసి‌న సమావేశం

హైదరాబాద్: కృష్ణా నది నీటి వినియోగంపై బీజేపీ కార్యాలయంలో సమావేశం ముగిసింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో కృష్ణా నదీ జలాల సాధన పోరాట కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా బీజేపీ నేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో కృష్ణా నీటిలో హక్కు కోసం పోరాటం చేస్తామన్నారు. 


సీఎం కేసీఆర్ వెంటనే అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలన్నారు. తెలంగాణ ప్రయోజనాలను కాపాడటంలో సీఎం కేసీఆర్ విఫలమయ్యారని పొంగులేటి పేర్కొన్నారు. చట్టబద్ధంగా తెలంగాణకు రావాల్సిన నీటిని వదులుకునే ప్రసక్తే లేదన్నారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం కేసీఆర్ రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారన్నారు. పోతిరెడ్డిపాడుతో దక్షిణ తెలంగాణ ఎడారిగా మారుతోందన్నారు. ఏ ఒక్క ప్రాజక్టుకు బీజేపీ వ్యతిరేకం కాదని.. బీజేపీపై టీఆర్ఎస్ దృష్ప్రచారం చేస్తోందని పొంగులేటి సుధాకరరెడ్డి పేర్కొన్నారు.

Updated Date - 2020-06-01T20:35:35+05:30 IST