కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశం వాయిదా

ABN , First Publish Date - 2020-09-17T08:24:30+05:30 IST

కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశం వాయిదా పడింది. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈనెల 20న ఈ సమావేశాన్ని

కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశం వాయిదా

హైదరాబాద్‌, సెప్టెంబరు 16 (ఆంధ్రజ్యోతి): కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశం వాయిదా పడింది. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈనెల 20న ఈ సమావేశాన్ని నిర్వహించాల్సి ఉంది. వరద జలాల వాడకంపై ఈ సమావేశంలో చర్చించాలని నిర్ణయించారు. ప్రస్తుతం కృష్ణా బేసిన్‌లో వరదలు వస్తున్నాయని, రోజూ సముద్రంలోకి నీరు వృథాగా వెళుతోందని, ఈ పరిస్థితుల్లో నీటి వాడకంపై చర్చించడం అనవసరమని ఏపీ ప్రభుత్వం కృష్ణా బోర్డుకు లేఖను రాసింది. దీంతో త్రిసభ్య కమిటీ సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లు కృష్ణా బోర్డు ప్రకటించింది. 

Updated Date - 2020-09-17T08:24:30+05:30 IST