రోడ్లపై అర్జీలు.. దుమ్మెత్తిపోస్తున్న వరద బాధితులు

ABN , First Publish Date - 2020-11-19T21:50:33+05:30 IST

గ్రేటర్ హైదరాబాద్‌లో వరద బాధితుల గోడు వర్ణణాతీతంగా మారింది. నిన్నటి దాకా ఓ సీన్- అంతలోనే సీన్ రివర్స్

రోడ్లపై అర్జీలు.. దుమ్మెత్తిపోస్తున్న వరద బాధితులు

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్‌లో వరద బాధితుల గోడు వర్ణణాతీతంగా మారింది. నిన్నటి దాకా ఓ సీన్- అంతలోనే సీన్ రివర్స్ అయింది. వరద సాయం కోసం నిన్నటి దాకా మీ సేవా కేంద్రాల వద్ద కిలోమీటర్ల కొద్ది క్యూలు ఉండేవి. అంతలోనే అక్కడ దృశ్యాలు మారిపోయాయి. వరద సాయాన్ని ఉన్నట్టుండి నిలిపివేయడంతో బాధితుల్లో ఆగ్రహావేశాలు కట్టలు తెంచుకున్నాయి. పలు చోట్ల బాధితులు ఆందోళనలకు దిగారు. బస్సులు నిలిపేశారు. ప్రభుత్వంపై మండిపడ్డారు.


ఇదిలా ఉంటే తాజాగా బాధితులు అప్లై చేసుకున్న అర్జీలు ఇప్పుడు రోడ్లపై ప్రత్యక్షమవుతున్నాయి. రోడ్లపై చిత్తు కాగితాల్లా పడి ఉన్నాయి. దీంతో బాధితులు అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్నారు. హైదరాబాద్‌లో మీ సేవా కేంద్రాల వద్ద రోడ్లపై పడి ఉన్న అర్జీల దృశ్యాలను స్థానికులు ఏబీఎన్‌కు పంపారు.Updated Date - 2020-11-19T21:50:33+05:30 IST