ముగిసిన ‘ఎలీసా’ వైద్య పరీక్షలు

ABN , First Publish Date - 2020-06-01T09:42:59+05:30 IST

కరోనా ఉన్నప్పటికీ ఆ లక్షణాలు బయటికి కనబడని వారిని గుర్తించడమే లక్ష్యంగా ఇంటింటా నిర్వహించిన ఎలీసా వైద్య పరీక్షలు ఆదివారంతో ముగిశాయి.

ముగిసిన ‘ఎలీసా’ వైద్య పరీక్షలు

  • ఐదు కట్టడి ప్రాంతాల్లో నమూనా సేకరణ పూర్తి

మియాపూర్‌, మే 31 (ఆంధ్రజ్యోతి): కరోనా ఉన్నప్పటికీ ఆ లక్షణాలు బయటికి కనబడని వారిని గుర్తించడమే లక్ష్యంగా ఇంటింటా నిర్వహించిన ఎలీసా వైద్య పరీక్షలు ఆదివారంతో ముగిశాయి. హైదరాబాద్‌లోని ఐదు కట్టడి ప్రాంతాల్లో శని, ఆదివారాల్లో 500 మంది నుంచి రక్తనమూనాలు సేకరించాలనుకున్న వైద్య సిబ్బంది, 10 బృందాలుగా ఏర్పడి తమ లక్ష్యాన్ని చేరుకున్నారు. ఒక్కో ప్రాంతం నుంచి 50 శాంపిళ్ల చొప్పున శనివారం 250, ఆదివారం 250 నమూనాలు సేకరించామని రాష్ట్ర కొవిడ్‌-19 అధికారి, ఐసీఎంఆర్‌ సీనియర్‌ శాస్త్రవేత్త లక్ష్మయ్య తెలిపారు. మియాపూర్‌లోని సాయినగర్‌, చందానగర్‌ ప్రాంతాలు, ఆదిభట్ల, బాలాపూర్‌, టపాచపుత్రలో నమూనాలు తీసుకున్నామని పేర్కొన్నారు.వీటిని సీరమ్‌లుగా సేకరించి చెన్నైలోని ల్యాబ్‌కు పంపనున్నట్టు తెలిపారు. అనంతరం ఢిల్లీలో ఉన్న ల్యాబ్‌లోనూ పరీక్షిస్తారని.. రెండు లేదా మూడు వారాల్లో సమగ్ర నివేదిక వస్తుందని ఆయన తెలిపారు.

Updated Date - 2020-06-01T09:42:59+05:30 IST