వైద్య సిబ్బంది సేవలు అమోఘం

ABN , First Publish Date - 2020-04-05T16:05:01+05:30 IST

కరోనా అనగానే అందరూ దూరంగా పారిపోతున్న సమయంలో..

వైద్య సిబ్బంది సేవలు అమోఘం

నల్గొండ: కరోనా అనగానే అందరూ దూరంగా పారిపోతున్న సమయంలో వైద్య సిబ్బంది సేవలు అమోఘం. కింది స్థాయిలో వారు నిర్వహిస్తున్న పాత్రను ఎంతపొగిడినా తక్కువే. ఎక్కడైనా కరోనా అనుమానితులు ఉన్నా.. పాజిటీవ్ కేసులు నమోదు అయినా.. ఆ ప్రాంతంలో ముందుగా అడుగుపెట్టేది వైద్య సిబ్బందే. ఎలాంటి భయం లేకుండా ఆరోగ్య సర్వేలకోసం గడప.. గడప తొక్కుతున్నారు. ఇంట్లో కుటుంబసభ్యులు వద్దంటున్నాసరే కరోనా బాధ నుంచి ప్రజలను రక్షించేందుకు విధి నిర్వహణే కర్తవ్యంగా ముందుకు సాగుతున్నారు.


కరోనాపై వైద్యులు ఎప్పటికప్పుడు కనిపెడుతూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఆదివారం నల్గొండ జిల్లా కేంద్రంలో పాజిటీవ్ వచ్చిన వ్యక్తుల ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో సర్వే చేసేందుకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ నుంచి వైద్య సిబ్బంది వెళ్లారు. కరోనాకు ఎవరూ భయపడాల్సిన పనిలేదని వైద్య సిబ్బంది అన్నారు. కరోనా గాలి ద్వారా రాదని, మాట్లాడినప్పుడు తుంపర్లద్వారా వస్తుందన్నారు. అందుకే ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని సూచించారు. తాము చేస్తున్న సర్వేలో ఎవరికైనా కరోనా సింటమ్స్ కనిపిస్తే పై అధికారులకు తెలియజేస్తామని, తద్వారా వారిని ఆస్పత్రికి పంపించడం జరుగుతుందని వైద్య సిబ్బంది పేర్కొన్నారు.

Updated Date - 2020-04-05T16:05:01+05:30 IST