వైద్య ఉద్యోగి ఆత్మహత్యాయత్నం
ABN , First Publish Date - 2020-09-16T06:18:59+05:30 IST
వరంగల్ అండర్ రైల్వేగేట్ ప్రాంతం అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్‌లో అడ్మినిస్ట్రేటర్‌గా విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగి విజయలక్ష్మి సోమవారం రాత్రి

కరీమాబాద్, సెప్టెంబరు 15 : వరంగల్ అండర్ రైల్వేగేట్ ప్రాంతం అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్‌లో అడ్మినిస్ట్రేటర్‌గా విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగి విజయలక్ష్మి సోమవారం రాత్రి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కుటుంబసభ్యుల వివరాల మేరకు.. నగరంలోని 21వ డివిజన్ ఉర్సు బొడ్రాయికి చెందిన విజయలక్ష్మి ఎస్‌ఆర్‌ఆర్ తోటలోని అర్బన్ హెల్త్ సెంటర్‌లో 12 ఏళ్లుగా పనిచేస్తోంది. రోజువారీ కార్యకలాపాల రిపోర్టులను ఉన్నతాధికారులకు పంపడంలో విజయలక్ష్మి నిర్లక్ష్యం చేస్తోందని మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అరుణ్ చంద్ర ఒత్తిడి చేయడంతో మనస్తాపం చెందిన ఆమె ఆత్మహత్యకు యత్నించినట్లు ఆరోపించారు. దీనిపై మెడికల్ అఫీసర్ డాక్టర్ అరుణ్ చంద్రను వివరణ కోరగా.. కొవిడ్ పరీక్షల నేపథ్యంలో రోజువారీగా డేటాను సకాలంలో ఉన్నతాధికారులకు పంపించాలని మాత్రమే విజయలక్ష్మిని కోరామని, అంతకు మించి ఆమెపై ఎలాంటి ఒత్తిడిని తీసుకురాలేదన్నారు.