వైద్యశాఖలో నియామకాలు చేపడతాం: ఈటల
ABN , First Publish Date - 2020-03-13T09:34:37+05:30 IST
వైద్య శాఖలో త్వరలోనే నియామకాలను చేపడతామని ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అసెంబ్లీలో చెప్పారు. ప్రభుత్వ అస్పత్రుల్లో రోగుల సంఖ్య పెరుగుతున్నదని

హైదరాబాద్, మార్చి 12 (ఆంధ్రజ్యోతి): వైద్య శాఖలో త్వరలోనే నియామకాలను చేపడతామని ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అసెంబ్లీలో చెప్పారు. ప్రభుత్వ అస్పత్రుల్లో రోగుల సంఖ్య పెరుగుతున్నదని, అందుకు తగ్గ సిబ్బంది లేరన్నారు. రాష్ట్రంలోని ఏరియా ఆస్పత్రుల్లో ఇప్పటికే రూ. 41.12 కోట్లతో ఐసీయూ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 45 డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేశామని, అవసరమైతే మరిన్ని పెంచుతామని చెప్పారు. రాష్ట్రంలో సుమారు 10 వేల మంది కిడ్నీ సమస్యలతో బాధ పడుతున్నారని చెప్పారు.