కరోనాబారిన పడిన జర్నలిస్టులకు ఆర్ధిక సాయం
ABN , First Publish Date - 2020-06-26T00:13:02+05:30 IST
నగరంలో కొత్తగా 12మంది జర్నలిస్టులకు కరోనా పాజిటివ్ వచ్చినందున ఆ 12 మంది జర్నలిస్టులకు కూడా ఒక్కొక్కరికి 20వేల చొప్పున, క్వారంటైన్‌లో ఉన్న 5 మంది జర్నటస్లుకు 10వేల చొప్పున 2లక్షల 90వల రూపాయల ఆర్ధిక సాయం తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ ఛైర్మన్ అల్లం నారాయణ ప్రకటించారు.

హైదరాబాద్: నగరంలో కొత్తగా 12మంది జర్నలిస్టులకు కరోనా పాజిటివ్ వచ్చినందున ఆ 12 మంది జర్నలిస్టులకు కూడా ఒక్కొక్కరికి 20వేల చొప్పున, క్వారంటైన్‌లో ఉన్న 5 మంది జర్నటస్లుకు 10వేల చొప్పున 2లక్షల 90వల రూపాయల ఆర్ధిక సాయం తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ ఛైర్మన్ అల్లం నారాయణ ప్రకటించారు. ఇప్పటి వరకూ కరోనా వైరస్ పాజిటివ్ వచ్చిన 99 మంది జర్నలిస్టులకు 20వేల చొప్పున 19లక్షల 80వేల రూపాయల ఆర్ధిక సాయం అందజేశామని తెలిపారు. అదే విధంగా హోంక్వారంటైన్‌లో ఉన్న 52 మంది జర్నలిస్టులకు 10వేల చొప్పున 5లక్షల 20వేల రూపాయల ఆర్ధిక సాయాన్ని అందించినట్టు తెలిపారు.
ఇప్పటి వరకూ 151 మంది జర్నలిస్టులకు మొత్తం 25 లక్షల రూపాయలను మీడియా అకాడమీ నిధుల నుంచి అందించామని అల్లం నారాయణ తెఇలపారు. కరోనా వైరస్ బారిన పడిన పాజిటివ్, క్వారంటైన్‌జర్నలిస్టులు ప్రభుత్వ డాక్టర్లు ధృవీకరించిన మెడికల్ రిపోర్టులు అకాడమీ కార్యాలయానికి తప్పని సరిగా పంపించాలని సూచించారు. జర్నలిస్టు మిత్రులు తమ వివరానలు తెలంగాణ రాష్ట్ర మీడియా ఛైర్మన్ వాట్సప్ నెం. 8096677444 కు పంపాలని అన్నారు. మరిన్ని వివరాలకు మీడియా అకాడమీ మేనేజర్ సెల్‌నెం. 9676647807ను సంప్రదించాలని అన్నారు.